ETV Bharat / city

రైతు దినోత్సవం...పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రైతులకు లబ్ధిచేకూర్చే పలు కార్యక్రమాలు ప్రారంభించనుంది. సీఎం జగన్​.. కడప జిల్లా పర్యటన అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రైతు దినోత్సవంలో పాల్గొంటారు. సున్నావడ్డీ రుణాల బకాయిలు విడుదల చేయడంతో సహా పలు కీలక కార్యక్రమాలను సీఎం ఇవాళ ప్రారంభించనున్నారు.

రైతు దినోత్సవం...పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
రైతు దినోత్సవం...పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
author img

By

Published : Jul 8, 2020, 6:52 AM IST

Updated : Jul 8, 2020, 7:19 AM IST

రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పలు కార్యక్రమాలను ప్రారంభించనుంది. కడప జిల్లా పర్యటన నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో జరిగే రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. గత ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీల కింద 2014 నుంచి 2018 వరకూ రైతులకు చెల్లించాల్సిన రూ. 1046.60 కోట్ల బకాయిలను సీఎం విడుదల చేయనున్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమచేయనున్నారు. వ్యవసాయంలో ఉత్పత్తి పెంపు, కూలీల కొరత ఇబ్బందులను అధిగమించడానికి, పెట్టుబడులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున యాంత్రీకరణను ప్రోత్సహించనుంది. రూ.1650 కోట్లతో యంత్ర సేవా కేంద్రాలను చేపట్టనుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 10 వేల 614 వైఎస్​ఆర్​ రైతు భరోసా కేంద్రాల్లో రూ. 1572 కోట్ల విలువ గల యంత్రాలు అందుబాటులో ఉంచనున్నారు.

యంత్ర శిక్షణ కేంద్రాలు ఏర్పాటు

ఒక్కో రైతు భరోసా కేంద్రం వద్ద కనీసం రూ.10 నుంచి 15 లక్షల విలువైన యంత్రాలను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే 65 ఆర్బీకే హబ్‌ల వద్ద రూ. 78 కోట్ల విలువైన యంత్రాలు పెట్టనున్నారు. ఒక్కో హబ్‌ వద్ద రూ.1.2 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలు పెడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు మూడు వ్యవసాయ యంత్ర శిక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. శ్రీకాకుళం జిల్లాలోని నైరా, తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట, కర్నూలు జిల్లాలోని తంగడంచల్లో రూ. 42 కోట్ల వ్యవయంతో ఈ మూడు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు కేంద్రాల ద్వారా ఏడాదికి 1500 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కేంద్రాలని సీఎం నేడు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలిపే ఉద్దేశంతో డాక్టర్‌ వైఎస్సార్ రైతు భరోసా మాసపత్రికను వ్యవసాయశాఖ ప్రారంభిస్తోంది. ఈ మాసపత్రికను సీఎం జగన్ ఆవిష్కరిస్తారు.

ఫిషింగ్​ హార్బర్లు, ఫిష్​ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం

సమగ్ర ఎరువుల యాజమాన్యం, రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఉద్దేశించిన 155251 టోల్‌ ఫ్రీ నంబరు పోస్టర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. మత్స్యకారులకు ఉపాధి కల్పన, సముద్రంలో పెద్ద ఎత్తున ఫిషింగ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8 చోట్ల ఫిషింగ్‌ హార్బర్లను, 4 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లను నిర్మించనుంది. ఫిషింగ్‌ హార్బర్లలో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లకు నాబార్డ్‌ ఆర్థిక సహాయం అందించనుంది. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకోనుంది. 8 ఫిషింగ్‌ హార్బర్లకు, 4 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లకోసం దాదాపు రూ.3వేల కోట్లను ప్రభుత్వం ఖర్చుచేయనుంది. కొత్తగా 1021 కేంద్రాల్లో పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు చెల్లించాల్సిన రూ. 54.6 కోట్ల బకాయిలను కూడా ఇవాళ చెల్లించనున్నారు.

ఇదీ చదవండి : ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు

Last Updated : Jul 8, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.