తెలంగాణలో వైఎస్ షర్మిల తలపెట్టిన ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని భావించిన షర్మిల.. ఈ నెల 9న హైదరాబాద్లోని ఆమె నివాసం లోటస్ పాండ్లో నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. రాజన్న రాజ్యం కోసం ఆ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకోసం వైఎస్సార్ అభిమానుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
సమావేశాలకు లోటస్ పాండ్ సరిపోదని భావించిన షర్మిల... జిల్లాల్లోనే పర్యటించాలని నిర్ణయించారు. ఈ నెల 21న ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున... ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: రాజన్న రాజ్యం కోసం ఖమ్మం జిల్లాలో షర్మిల పర్యటన