young woman suicide: తెలంగాణలోని హనుమకొండ జిల్లా దామెర మండలం లాదెళ్ల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతితో అదే గ్రామానికి చెందిన సంఘాల సాయి అనే యువకుడికి పరిచయం ఏర్పడింది. ఈ తరుణంలో చరవాణిలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అదే క్రమంలో గ్రామానికి చెందిన సంఘాల సాయి స్నేహితుడు తాళ్లపల్లి ప్రణయ్ వారి వద్ద నుండి వీడియోలు తీసుకున్నాడు.
ఆ వీడియోలతో ప్రణయ్.. యువతిని వేధింపులకు గురి చేశాడు. తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 18వ తేదీన క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. యువతిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వరంగల్లుకు తరలించారు. చికిత్స పొందుతూ యువతి సోమవారం రాత్రి మరణించింది. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం లాదెళ్ల గ్రామానికి తరలించారు.
ఈ క్రమంలో తన కూతురు మరణానికి గ్రామానికి చెందిన సంఘాల సాయి, తాళ్లపల్లి ప్రణయ్ కారణమంటూ తల్లిదండ్రులు బందువులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని వారి ఇంటి ముందు ఉంచేందుకు ప్రయత్నించగా, తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఏసీపీ శివరామయ్య న్యాయం జరిగేలా చూస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి: