ETV Bharat / city

ప్రేయసి పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఆత్మహత్య - పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం లెనిన్​ నగర్​లో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోకపోగా... ప్రేమించడం లేదని చెప్పిందని మనస్థాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు.

ప్రేయసి పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఆత్మహత్య

author img

By

Published : Jun 8, 2020, 1:16 PM IST

ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని మనస్థాపానికి గురైన ఓ యువకుడు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో జరిగింది. వరంగల్ లేబర్ కాలనీకి చెందిన గడ్డికొప్పల శ్రీకాంత్, ఖమ్మం నగరానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల యువతి సరిగ్గా మాట్లాడటం లేదని... ఖమ్మం వచ్చి యువతి ఇంటికి వెళ్లి అడిగాడు. యువతి తల్లిదండ్రులు అతడిని పట్టణ రెండో పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.

యువతి శ్రీకాంత్​ని ప్రేమించడం లేదని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం లెనిన్​నగర్​లోని తమ బంధువుల ఇంట్లో పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. శ్రీకాంత్ పదో తరగతి వరకు చదివి కారు నడుపుతున్నాడు. మృతుడికి తండ్రి లేడు. తల్లి అక్క ఉన్నారు. వారి రోదనలతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి మార్చూరీ వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు...ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.