young man committed suicide: ప్రైవేట్ ఫైనాన్షియర్ వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఆర్జీఐఏ(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) ఠాణా పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
రంగారెడ్డి జిల్లాలోని పాత శంషాబాద్ జెండా చౌరస్తాకు చెందిన సాయి కిరణ్(25) కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకొని ద్విచక్ర వాహనాన్ని కొన్నాడు. నెలనెలా చెల్లించాల్సిన ఇన్స్టాల్ మెంట్ సక్రమంగా చెల్లించడం లేదంటూ సాయి కిరణ్‌ను దూషించి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తీవ్ర మనస్తాపం చెందిన సాయి కిరణ్.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Jagannadhastakam CD: ‘జగన్నాథాష్టకం’ సీడీని విడుదల చేసిన ఉపరాష్ట్రపతి