ETV Bharat / city

కరోనా బాధితుల ఆకలి తీరుస్తున్న ఆశ్రీ ఫౌండేషన్‌

author img

By

Published : May 8, 2021, 9:26 PM IST

అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదంటారు. కరోనా వేళ సొంతవారుసైతం పట్టించుకోని ఈ సమయంలో ఎంతో మందికి అండగా నిలుస్తోంది.. ఆశ్రీ ఫౌండేషన్‌. కొవిడ్‌ బాధితులకు ఉచితంగా ఆహారం అందిస్తూ ముందుకు వచ్చిందీ ఆ యువజంట. హైదరాబాద్​లో నిత్యం వందలమందికి పౌష్టికాహారం సరఫరా చేస్తూ... తామున్నామంటూ ధైర్యం నింపుతున్నారు.

asri foudation
కరోనా బాధితుల ఆకలి తీరుస్తున్న ఆశ్రీ ఫౌండేషన్‌
కరోనా బాధితుల ఆకలి తీరుస్తున్న ఆశ్రీ ఫౌండేషన్‌

కరోనా రెండో దశ విజృంభిస్తోంది. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. బాధితులకు సొంతవారి నుంచి ఆదరణ కరవైన ఈ సమయంలో..... ఆశ్రీ ఫౌండేషన్‌ భరోసానిస్తోంది. హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన పూర్ణిరెడ్డి, రాంకిషోర్ రెడ్డి దంపతులు.. కరోనా సోకినవారికి నిత్యం ఇంటివద్దకే ఆహారం అందిస్తున్నారు. వీరికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో ప్రచారం..

ఏడాదిగా ఆశ్రీ సోసైటీ ద్వారా కరోనా బాధితులకు నిత్యం ఆహారం తయారు చేసి... ఇంటి వద్దకే అందిస్తున్నారు. అవసరం ఉన్నవారు తమ సేవల్ని వినియోగించుకోవాలంటూ.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పిస్తున్నారు. ఆహారమే కాకుండా అన్ని రకాలుగా... కొవిడ్‌ బాధితులను, వారి కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు.

ఆహారం కావాలని కోరితే..

ఈ యువ దంపతులు చేస్తున్న సేవకు.. వారి కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు. ఎవరైనా ఆహారం కావాలని కోరితే.. 2గంటల్లో అందిస్తామని చెబుతున్నారు. వైద్య, ఇతర సేవల కోసం కూడా కాల్ చేస్తున్నారని.... వారికి కూడా చేతనైనంతా సాయం చేస్తున్నామన్నారు. మరికొందరు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి... పూర్ణిరెడ్డి, రాంకిశోర్‌రెడ్డి దంపతుల సేవలో భాగస్వామ్యం అవుతున్నారు.

సానుభూతి వద్దు.. సాయం చేయండి..

కరోనా బారిన పడిన వారికి సానుభూతి కాకుండా తమ వంతు సాయం చేయాలని ఆశ్రీ ఫౌండేషన్‌ పిలుపునిస్తోంది. ఆపత్కాలంలో చుట్టూ ఉన్నవారికి తోచినంత సహాయపడాలని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: బొగ్గు లేక... ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.