ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరిన మాట వాస్తవమేనని ప్రస్తుత ఝార్ఖండ్ స్వతంత్ర ఎంపీ పరిమల్ నత్వానీ స్పష్టం చేశారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన... ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఝార్ఖండ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటే చేసే అవకాశం లేనందున ముకేశ్ అంబానీతో సీఎం జగన్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిపారు. బయటవారికి రాజ్యసభ సీటు ఇచ్చే సంప్రదాయం ఇప్పటివరకూ తమ పార్టీకి లేదని... అయినప్పటికీ తనకు 3 రోజుల సమయం ఇవ్వాలని సీఎం జగన్ కోరినట్టు చెప్పారు. ఏపీ నుంచి అవకాశం రాకపోతే ఒడిశా, బీహార్, అసోంలలో ఎక్కడో ఒక చోట నుంచి రాజ్యసభకు వెళ్లడానికి నత్వానీ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే పరిమల్ పేరు ఏపీ నుంచి దాదాపు ఖరారైనట్లేనని రాష్ట్రానికి చెందిన ఓ భాజపా ఎంపీతో పాటు, వైకాపా ఎంపీ పేర్కొన్నారు.
'జగన్‌ను రాజ్యసభ సీటు అడిగింది నిజమే'
ముఖ్యమంత్రి జగన్‌ను కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో ఏపీ నుంచి తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని సీఎం జగన్‌ను అడిగిన మాట వాస్తవమేనని ఎంపీ పరిమల్ నత్వానీ వెల్లడించారు. తనకు 3 రోజుల సమయం ఇవ్వాలని సీఎం జగన్ కోరినట్టు ఆయన చెప్పారు.

సంబంధిత కథనం