ETV Bharat / city

విశాఖ ఉక్కుపై సీఎంతో చర్చిస్తాం: వైకాపా ఎంపీలు - ycp mps on privatisation of the visakha steel plant

విశాఖ ఉక్కుపై కేంద్రం నుంచి స్పష్టత రాలేదని వైకాపా ఎంపీ బాలశౌరి అన్నారు. దిల్లీలో మాట్లాడిన ఆ పార్టీ ఎంపీలు... విశాఖ రైల్వే జోన్ అంశాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

visakha steel plant
ycp mps reaction on privatisation of the visakha steel plant
author img

By

Published : Feb 6, 2021, 7:10 AM IST

విశాఖ ఉక్కుపై కేంద్రం నుంచి స్పష్టత రాలేదని, వచ్చాకే ముఖ్యమంత్రిని కలిసి నిర్ణయం తీసుకుంటామని ఎంపీ బాలశౌరి తెలిపారు. దిల్లీలో శుక్రవారం సహచర ఎంపీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ రైల్వేజోన్‌పై ఎంపీ విజయసాయి రైల్వే మంత్రిని కలిశారని, చిన్నచిన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని బాలశౌరి వివరించారు. శాసనసభలో తాము ప్రవేశపెట్టిన రైతు బిల్లులనే కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

ఎన్నికల యాప్‌ విషయంలో ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. గతంలో ఓ లేఖ తెదేపా కార్యాలయంలో తయారైనట్లే, యాప్‌ కూడా అక్కడే తయారైందని విమర్శించారు. తన సొంత జిల్లా గుంటూరు, తనకు ఉద్యోగమిచ్చిన గురువు జిల్లా చిత్తూరులో ఆయన ఏకగ్రీవాలకు ఒప్పుకోనంటున్నారని.. గ్రామాలు ప్రశాంతంగా ఉండడం ఆయనకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసు, ఇతర కేసులపై విచారించాలని ప్రధానిని కోరతామన్నారు. ప్రత్యేక హోదా అంశానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెబుతోందని.. యుద్ధాలు, విపత్తుల విషయంలో ప్రభుత్వాలు దృఢ నిర్ణయాలు తీసుకోవాలే తప్ప ప్రగతి విషయంలో కాదని ఆయన అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం నిర్ణయాలు మార్చుకోవడమే ప్రజాస్వామ్యమని అభిప్రాయపడ్డారు.

8 నెలలు వేడుకుంటే తెదేపా ఎంపీలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎద్దేవా చేశారు. వెయ్యికాళ్ల మండపం, విజయవాడలో దేవాలయాలను చంద్రబాబు కూల్చారని విమర్శించారు. సదావర్తి భూములను తెదేపా నేతలు కాజేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. రాష్ట్రానికి ఉపాధి నిధులు రాకుండా తెదేపా ఎంపీలు దిల్లీలో కార్యాలయాల చుట్టూ తిరిగారని విమర్శించారు. ఏపీ ఫైబర్‌నెట్‌ అక్రమాలపై సీబీఐ విచారణ కోరతామన్నారు. లోటు బడ్జెట్‌ ఉన్నా అన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ఎంపీ చింతా అనూరాధ కొనియాడారు. సమావేశంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.