పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేసిన ఖర్చును వెంటనే తిరిగి చెల్లించాలని వైకాపా ఎంపీలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలసీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఎంపీలు కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,103 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఖర్చు చేసిందని... ఈ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని విన్నవించారు. అదేవిధంగా రూ.55,548 కోట్లు సవరించిన అంచనా వ్యయంతో ఇచ్చిన డీపీఆర్‌ను వెంటనే ఆమోదించాలని కోరారు.
ప్రాజెక్ట్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చును 15 రోజుల గడువులోగా కేంద్రం తిరిగి చెల్లింపులు జరిపేలా ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలని ఆర్ధిక మంత్రికి విన్నవించారు. రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సవరించాలని, వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ కింద ఇచ్చే నిధులను పునరుద్ధరించాలని కోరినట్లు పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి వెల్లడించారు. జీఎస్టీ బకాయిల కింద రూ.1605 కోట్లు వెంటనే విడుదల చేయాలని మంత్రి నిర్మలాసీతారామన్‌కి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి