ETV Bharat / city

అమరావతిలో నమ్మకానికి ఐదేళ్లనడం హాస్యాస్పదం: ఎంపీ సురేష్ - రాజధాని రైతుల పోరాటం వార్తలు

తెదేపాపై వైకాపా ఎంపీ నందిగం సురేష్ విమర్శలు గుప్పించారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ బ్రతికే పరిస్థితి లేదన్నారు. అమరావతిలో నమ్మకానికి ఐదేళ్లు అనడం హాస్యాస్పదంగా ఉందని.. దళితులను మోసం చేసినందుకు ఐదేళ్లు నిండిందని ఆరోపించారు.

ycp mp nandigam suresh
ycp mp nandigam suresh
author img

By

Published : Oct 23, 2020, 7:12 PM IST

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా పోయిందని... రానున్న రోజుల్లో ఆ పార్టీ బ్రతికే పరిస్థితి లేదని వైకాపా ఎంపీ నందిగం సురేష్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అమ‌రావ‌తి ప్రాంతంలో జ‌రిగిన ధ‌ర్నాలు, దీక్షలను అంతా చూస్తున్నారని...ఒక వైపు అమ‌రావ‌తి ఐకాస పేరిట తెదేపా నాయకులు- మ‌రోప‌క్క రాజ‌ధాని ప్రాంతంల్లో తాము కూడా ఉండాలని... పేదలు దీక్షలు చేశారన్నారు. కొందరు నాయకులు పేదలను మేకప్ ఆర్టిస్టులు అంటున్నారని... అమరావతి వెళ్లి చూస్తే ఎవరు ఏమిటో తెలుస్తుందన్నారు.

కృష్ణాయపాలెంలో తెలుగుదేశానికి చెందిన కొందరు పేదలపై ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఎనిమిదో వింత అమరావతిలోనే ఉన్నట్లుగా చంద్రబాబు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో నమ్మకానికి ఐదేళ్లు అనడం హాస్యాస్పదంగా ఉందని- దళితులకు చేసిన మోసానికి ఐదేళ్లు నిండిందని ఆరోపించారు..

ఇదీ చదవండి

చెక్​డ్యామ్​ వద్ద సెల్ఫీ... తల్లి మృతి, కుమారుడు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.