ETV Bharat / city

నేడు వైకాపా అభ్యర్థుల నామినేషన్ - ap legislative council

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మంత్రి మోపిదేవి, రామకృష్ణా రెడ్డి, మహ్మాద్ ఇక్బాల్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

నేడు వైకాపా అభ్యర్థుల నామినేషన్
author img

By

Published : Aug 14, 2019, 6:50 AM IST

నేడు వైకాపా అభ్యర్థుల నామినేషన్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, చల్లా రామకృష్ణా రెడ్డి, మహ్మాద్ ఇక్బాల్​ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వైకాపా అధ్యక్షుడు జగన్​మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. నామినేషన్లకు చివరి రోజైన బుధవారం వీరంతా నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత వెలగపూడిలోని శాసనమండలి కార్యదర్శికి నామపత్రాలు సమర్పించనున్నారు.

అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 3సీట్లు భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి 3వైకాపా వశంకానున్నాయి. ఈ ఎన్నికలకు తెదేపా దూరంగా ఉంది. నామినేషన్ పత్రాలు దాఖలు గడువులోపు ఎవరూ నామపత్రాలు దాఖలు చేయకపోతే... వైకాపా అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నెల 19న... సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించి ధ్రువపత్రం ఇవ్వనున్నారు.

ఇదీ చదవండీ...

'రివర్స్‌ టెండరింగ్‌తో పనుల్లో జాప్యం తప్పదు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.