ETV Bharat / city

ఫోన్లు ట్యాపింగ్​ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు: అంబటి

author img

By

Published : Aug 17, 2020, 7:05 PM IST

ఫోన్ల ట్యాపింగ్​పై చంద్రబాబు చేసిన ఆరోపణలను రుజువు చేయాలని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ట్యాపింగ్​ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

YCP MLA Ambati Rambab
YCP MLA Ambati Rambab

న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేయలేదని....అలాంటి అవసరం జగన్ సర్కారుకు లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడేవారి ఫోన్లను తప్పకుండా ట్యాపింగ్ చేసే అధికారం ఉందని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అసత్య, నిందారోపణ వార్తలు రాసే పత్రికలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య దూరం పెంచాలని చంద్రబాబు చూస్తున్నారని అంబటి ఆరోపించారు.

ఇదీ చదవండి

ఫోన్ల ట్యాపింగ్​ అంశంపై హైకోర్టులో పిటిషన్​ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.