ETV Bharat / city

ycp ministers: 'సీఎంకు ప్రజాబలం పెరిగింది' - ap updates

సాధారణ ఎన్నికలకంటే పరిషత్ ఎన్నికల పోరు నాటికి సీఎం జగన్​కి ప్రజాబలం పెరిగిందని వైకాపా నేతలు కొనియాడారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు పన్నినా.. రాష్ట్ర ప్రజలు వైకాపా వైపే ఉన్నారనేదానికి స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.

ycp ministers
ycp ministers
author img

By

Published : Sep 20, 2021, 9:38 AM IST

2019 సాధారణ ఎన్నికలకంటే స్థానిక సంస్థల పోరు నాటికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాబలం పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపాకు స్థానిక సంస్థల్లో ఎప్పుడూ ప్రజామోదం లభించలేదు. 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా చంద్రబాబు ఆపేశారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం ఈ ఎన్నికల నిర్వహణకు పూనుకుంటే అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేశారు. 12కి 12 కార్పొరేషన్లనూ, 75మున్సిపాలిటీల్లో 74వైకాపా కైవసం చేసుకుంది. అమరావతిలోనూ పంచాయతీలు, స్థానిక సంస్థల్లో ఓడిపోయారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో కూడా ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి గెలిచారు’ అని పేర్కొన్నారు.

జగన్‌ కన్నెర్ర చేస్తే మీరు ఉంటారా?: మంత్రి అనిల్‌

‘తెదేపా బి ఫారాలు ఇచ్చి, డబ్బులు పంచి, ప్రచారమూ చేసి, తర్వాత ఓటమి తప్పదని అర్థమై పోటీ చేయడం లేదంటూ పారిపోయి, ఇప్పుడు మేం పోటీ చేయలేదు కాబట్టే వైకాపాకు ఎక్కువ సీట్లు వస్తున్నాయంటూ మాట్లాడేందుకు తెదేపా నేతలకు సిగ్గుందా’ అని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. ఆదివారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘తెదేపా నేతలు మాట్లాడితే రాజారెడ్డి రాజ్యాంగమంటున్నారు..మీరంటున్నట్లుగా నిజంగా ఫ్యాక్షన్‌ రాజకీయమే మేం చేస్తే, జగన్‌ కన్నెర్ర చేస్తే మీరు ఉంటారా? తిరగ్గలరా? అయ్యన్ననో, ఇంకొకరో ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడగలిగేవారా? గొయ్యిలో పాతేసి ఉండేవాళ్లం. కానీ, అవన్నీ మా జగన్‌ విధానం కాదు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఆయన, మేమూ సంయమనంతో పనిచేస్తున్నాం. జగన్‌కు ప్రజల్లో విశ్వాసం తగ్గిందని దుష్ప్రచారం చేస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే మీ పార్టీలో మిగిలిన 19మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి. మళ్లీ పోటీ చేసి గెలిచి అప్పుడు మాట్లాడండి’ అని మండిపడ్డారు.

ప్రజలు వైకాపా వైపే: మంత్రి ముత్తంశెట్టి

ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు పన్నినా.. రాష్ట్ర ప్రజలు వైకాపా వైపే ఉన్నారనేదానికి స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ ఊ.. అంటే చంద్రబాబు, లోకేశ్‌ తప్పా తెదేపాలో మిగిలిన వారంతా వైకాపాలోకి వచ్చేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు: మంత్రి సురేష్‌

తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ఇందుకు పరిషత్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. తెదేపా నాయకుడు అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఆదివారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖలో భూకుంభకోణాలు చేసిన అయ్యన్నపాత్రుడు మంత్రులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హోంమంత్రి సుచరిత గురించి అసభ్య పదజాలంతో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ఘనకార్యాలు అందరి తెలుసని మండిపడ్డారు.

పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని గెలిచారు?: అంబటి

‘చంద్రబాబు పాత నియోజకవర్గం చంద్రగిరిలో తెదేపా శంకరగిరి మాణ్యాలు పట్టింది. ఇప్పటి నియోజకవర్గం కుప్పంలోనూ కుప్పకూలింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలుస్తారో లేదో చూద్దాం’ అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించామని తెదేపా వాళ్లంటున్నారు..వారు బహిష్కరించని మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని గెలిచారు?’ అని ప్రశ్నించారు.

సంక్షేమ పథకాలవల్లే ఈ ఫలితాలు: జూపూడి

‘సంక్షేమ పథకాలను తీసుకున్న వ్యక్తులు కృతజ్ఞతగా వేసిన ఓట్లుగా మేం భావిస్తున్నాం, అది వారి బాధ్యత. అనుమానం లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. జగన్‌ చేపట్టిన సామాజిక న్యాయానికి ప్రతిబింబమే ఈ ఫలితాలని పేర్కొన్నారు. ఆదివారం వైకాపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘ప్రభుత్వం అంటేనే పంచడం..వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ రూ.1.40లక్షల కోట్లను అర్హులైన ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేసింది’ అని తెలిపారు.

ఇదీ చదవండి

tdp: ప్రజల స్వేచ్ఛను హరించి గెలిచారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.