ETV Bharat / city

నామినేటెడ్‌ ఎమ్మెల్సీలుగా మోషేనురాజు, మర్రి రాజశేఖర్‌? - Governor of Andhra Pradesh

గవర్నర్​ కోటాలో నామినేట్ చేసే ఎమ్మెల్సీ స్థానాలపై అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. ఒక స్థానాన్ని ఎస్సీ వర్గానికి ఖరారు చేసినట్లు తెలిసింది. మరో స్థానాన్ని ముస్లిం మైనార్టీ నేతకు అనుకున్నప్పటికీ... గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ పేరు తెరపైకి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ycp looks on nominated mlc seats
ycp looks on nominated mlc seats
author img

By

Published : Jul 14, 2020, 6:47 AM IST

గవర్నర్‌ నామినేట్‌ చేసే ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీగా ఉన్న రెండింటికి అభ్యర్థుల పేర్లు కొలిక్కి వచ్చాయి. ఒక స్థానాన్ని ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేనురాజు (పశ్చిమగోదావరి జిల్లా)కు ఖరారు చేసినట్లు తెలిసింది. రెండో స్థానాన్ని కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం మైనారిటీ నేతకు ముందుగా అనుకున్నప్పటికీ, చివరి నిమిషంలో గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్‌ పేరు తెరపైకి వచ్చినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు రాజశేఖర్‌కు ఇస్తే బాగుంటుందన్న అంశంపై ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగినట్లు సమాచారం.

తెరపైకి తోట త్రిమూర్తులు పేరు
పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి రాజీనామా చేయడంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి కాపు, రెండోది బీసీ వర్గానికి చెందిన వారికి కేటాయిస్తున్నట్లు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణను మంత్రిమండలిలోకి తీసుకుంటే అదే నియోజకవర్గానికి చెందిన కాపు నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారంటున్నారు. వేణును మంత్రిమండలిలోకి తీసుకోకపోతే ఎమ్మెల్సీ స్థానానికి తోట త్రిమూర్తులు లేదా చీరాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ పేరును పరిగణనలోకి తీసుకోవచ్చని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ: ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.