శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌కు అధికార వైకాపా లేఖ రాసింది. మండలిలో జరిగిన పరిణామాలను ఎథిక్స్ కమిటీకి ఇవ్వాలని లేఖలో కోరింది. ఇటీవల మండలిలో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై అధికార, విపక్షాల మద్య మాటల యుద్ధం సాగింది.
ఈ బిల్లులకు సంబంధించి రూల్ 90 కింద ఇచ్చిన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్ష తెదేపా కోరగా.. నిబంధనల ప్రకారం లేని నోటీసును ఛైర్మన్ ఎలా పరిగణనలోకి తీసుకుంటారని అధికార వైకాపా వాదించింది. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. మండలి నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వైకాపా మండలి ఛైర్మన్‌కు రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చూడండి..