స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమినషనర్కు వైకాపా నేతలు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు. కుప్పం సహా ఇతర చోట్ల ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ కేసులో అయినా 48 గంటల్లో స్టే తీసుకువస్తానని న్యాయస్థానాలను కించపరిచేలా, అగౌరపరిచేలా నారా లోకేశ్ మాట్లాడారని లేఖలో ప్రస్తావించారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీచదవండి: SZC Meeting: రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు: సీఎం జగన్