బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 17న శాసనమండలిలో జరిగిన వ్యవహారంపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని వైకాపా నిర్ణయించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విప్ గంగుల ప్రభాకరరెడ్డి తదితరులు మంగళవారం మండలి ప్రాంగణంలో సమావేశమయ్యారు. 'ఆ రోజున సభలో గందరగోళం నెలకొంది. తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిబంధనలకు విరుద్ధంగా చరవాణీతో ఫొటోలు, వీడియోలు తీశారు. తెదేపా ఎమ్మెల్సీలు మంత్రులపై దాడి చేశారు. ఈ ఘటనలపై ఎథిక్స్ కమిటీతో విచారణ జరిపించాలని చైర్మన్‌ను కోరదాం' అని సమావేశంలో నిర్ణయించారు.
ఉప ఎన్నికల్లో పోటీకి వైకాపా సిద్ధం
ఎమ్మెల్యేల కోటా శాసనమండలి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వైకాపా పోటీ చేయనుంది. నేడు అభ్యర్థిని ఖరారు చేయవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. దీంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తున్నారు. వైకాపా తరపున డొక్కానే బరిలో దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి :