ETV Bharat / city

handloom: వైకాపా రెండున్నరేళ్లలో.. ఒక్క క్లస్టరూ ఏర్పాటు కాని వైనం - చేనేత వృత్తి

కేంద్రం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ) కింద చేనేత కార్మికులకు 90% రాయితీతో వివిధ పరికరాలను అందిస్తోంది. ఆధునిక హంగులతో చేనేత వృత్తిని సరళతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ పథకంపై రాష్ట్రప్రభుత్వం చొరవ చూపడంలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లుగా కొత్తగా ఒక క్లస్టరూ ఏర్పాటు కాలేదు. దీంతో రాష్ట్రంలోని కార్మికులకు ఆధునిక పరికరాలు, నైపుణ్య శిక్షణకు దూరమయ్యారు.

handloom
handloom
author img

By

Published : Sep 15, 2021, 4:30 AM IST

ఆధునికత జోడింపుతో చేనేత వృత్తిని సరళతరం చేసేందుకు కేంద్రం అమలుచేస్తున్న జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాన్ని కార్మికులకు అందుబాటులోకి తేవడంలో రాష్ట్రప్రభుత్వం చొరవ చూపడం లేదు. కార్మికులకు విస్తృత ప్రయోజనాలను కలిగించే ఈ పథకాన్ని గత రెండున్నరేళ్లుగా పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రంలోని కార్మికులకు ఆధునిక పరికరాలు, నైపుణ్య శిక్షణ అందట్లేదు. కేంద్రం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ) కింద చేనేత కార్మికులకు 90% రాయితీతో వివిధ పరికరాలను అందిస్తోంది. మోటరైజ్డ్‌ జకార్డ్‌, ఫ్రేమ్‌ మగ్గం, 120/140 జకార్డ్‌ మిషన్‌, అచ్చు సెట్టు, నూలు చుట్టే యంత్రాలను ఇస్తోంది. చేనేతలకు బ్లాక్‌లెవల్‌ క్లస్టర్ల పేరుతో రూ.2 కోట్ల మేర సాయాన్ని అందిస్తోంది. అయితే క్లస్టర్లను గుర్తించి పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లుగా కొత్తగా ఒక క్లస్టరూ ఏర్పాటు కాలేదు. దీంతో కేంద్ర లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.20 లక్షల మంది కార్మికులున్నా ఇప్పటికీ 20 వేల మందికి మించి ఈ పథకంలో సాయం అందలేదు.

మూడేళ్ల కాలపరిమితితో ఒక క్లస్టర్‌కు రూ.2 కోట్ల సాయాన్ని అందిస్తుంది. క్లస్టర్‌కు 250 మంది కార్మికులు మించకూడదు. ఒకే ప్రాంతంలో ఎక్కువమంది కార్మికులు ఉంటే రెండు, మూడు క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. 2015లో కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా 2016-17లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 31 క్లస్టర్లను ఏర్పాటుచేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 క్లస్టర్లూ గత ప్రభుత్వంలో ఏర్పాటైనవే.

ప్రాధాన్య ప్రాంతాల్లో ఉన్న క్లస్టర్లు తక్కువే: చొరవ చూపే రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పథకం కింద అధిక నిధులు వస్తాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అత్యధిక క్లస్టర్లు ఉన్నా, ఇంకా తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఉన్న 54 క్లస్టర్లలో 31 గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే ఉన్నాయి. పట్టు చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లా ధర్మవరంలో రెండు, చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒకటి, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఒక క్లస్టర్‌ మాత్రమే ఉన్నాయి. కాటన్‌ చీరలు అధికంగా నేసే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రెండే ఉన్నాయి. ఖాదీ వస్త్రాలకు పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా పొందూరు, కోటకొమ్మల పట్టుచీరలకు ప్రత్యేకతగా నిలిచే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో క్లస్టర్లే లేవు. ఈ ప్రాంతాలన్నింటిలో మరిన్ని క్లస్టర్లను ఏర్పాటు చేయొచ్చు. ఈ ఏడాది కేంద్రమే ఏపీలో ఆరు క్లస్టర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిందని వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపితే మరిన్ని నిధులు వస్తాయి.

నేతన్న నేస్తం లక్ష్యం ఇదే: మగ్గాలను ఆధునికీకరించి కార్మికుల ఆదాయాన్ని పెంచేందుకే నేతన్న నేస్తం అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవు. ఎన్‌హెచ్‌డీపీ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే ఆధునిక పరికరాలన్నీ రూ.6 వేలకే నేతన్నలకు వస్తాయి. స్థలాలను లీజు ప్రాతిపదికన అందిస్తే కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. మరింతమంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది.
100% రాయతీతో షెడ్ల ఏర్పాటు: కార్మికులకు స్థలం ఉండి షెడ్‌ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే 100% రాయితీతో అవకాశం ఉంది. పరిమాణం ఆధారంగా రూ.70 వేలు, రూ.1.20 లక్షలు ఉచితంగా ఇస్తుంది. దీంతోపాటు కోరినవారికి రూ.5 వేల విలువ గల లైటింగ్‌ సెట్‌ ఇస్తుంది. కొత్త తరహాలో నేసేలా 45 రోజుల శిక్షణ కూడా అందిస్తుంది. ఈ కాలంలో రోజుకు రూ.210 చొప్పున వేతనంగా చెల్లిస్తుంది.

  • ఫ్రేమ్‌ మగ్గం

దీని వాస్తవ ధర రూ.25-38 వేలు.. లబ్ధిదారుడు చెల్లించాల్సింది రూ.2,500 నుంచి రూ.3,800

ఉపయోగం: చాలా ప్రాంతాల్లో చేనేత కార్మికులు గుంతమగ్గాల్లో వస్త్రాలు నేస్తున్నారు. వర్షాకాలంలో గుంతల్లోకి నీటి ఊట చేరి కొన్ని రోజులపాటు ఉపాధి లేకుండా పోతోంది. ఫ్రేమ్‌ మగ్గాల వినియోగం వల్ల ఆ సమస్య ఉండదు. వీటిని ఒక చోటు నుంచి మరో చోటుకు సులువుగా తరలించవచ్చు.

  • జకార్డ్‌ యంత్రం
    దీని వాస్తవ ధర రూ.15,000.. లబ్ధిదారుడు చెల్లించాల్సింది రూ.1,500

ఉపయోగం: సాధారణ చీరలు నేసే కార్మికులు మంచి డిజైన్ల వైపు మళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. చీర అంచుల్లో, మధ్యలో కోరుకున్న డిజైన్లను వీటితో వేయవచ్చు. చీర అందంగా తయారై ఆదాయం పెరుగుతుంది.

  • మోటరైజ్డ్‌ జకార్డ్‌
    దీని వాస్తవ ధర: రూ.14,750.. లబ్ధిదారుడు చెల్లించాల్సింది: రూ.1,475

ఉపయోగం: కార్మికులు పావు చెక్కలను కాళ్లతో నొక్కి నేస్తుంటారు. వాటి బరువు ఎక్కువగా ఉండటంతో కీళ్లనొప్పులు వచ్చేవి. మోటరైజ్డ్‌ జకార్డ్‌లో కింద ఉన్న బటన్‌ను కాలితో ఒత్తితే చాలు.. అల్లిక సులువుగా కదులుతుంది. శ్రమ తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది.

ఇదీ చదవండి..

HC ON MINING: మీరేమో నిద్రపోతుంటారు.. వాళ్లేమో తవ్వేస్తుంటారు: హైకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.