ఏపీది కరోనా కేసుల్లో 5వ స్థానం, మరణాల్లో 9వ స్థానం అని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధ్వాన్న పరిస్థితి ఉందన్న ఎంపీ జీవీఎల్... వ్యాక్సినేషన్‌లోనూ వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
సీఎం ఒక్క ఆస్పత్రికైనా వెళ్లి సౌకర్యాలు పరిశీలించారా..? అని నిలదీశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు భాజపా నిరసనలు చేపడుతుందని స్పష్టం చేశారు. రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆందోళనలు ఉంటాయని చెప్పారు.
ఇదీ చదవండి: