ETV Bharat / city

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో.. అదే ప్రధానమట! - ఏపీ తాజా రాజకీయ వార్తలు

ఎమ్మెల్యేల కోటాలో మూడు, స్థానిక సంస్థల విభాగంలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు అధికార వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ycp-finalizes-14-members-of-mlc-candidates
వైకాపా 14 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు!
author img

By

Published : Nov 10, 2021, 3:35 PM IST

ఎమ్మెల్యేల కోటాలోని మూడు స్థానాల్లో ఒకటి డీసీ గోవిందరెడ్డి, మరోటి పాలవలస విక్రాంత్‌కు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకాకుళం పర్యటనకు వెళ్లినపుడు అక్కడే విక్రాంత్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారంటూ ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. మూడో స్థానం కొలిక్కి రావాల్సి ఉంది. ఈ నెల 15 లేదా 16న ముగ్గురు అభ్యర్థులూ నామినేషన్లు వేయవచ్చంటున్నారు. ఇక, స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలకు మంగళవారమే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ 14 స్థానాలనూ కైవసం చేసుకుంటామని వైకాపా అధినాయకత్వం అంచనా వేస్తోంది.

శాసనమండలిలో ఇప్పటికే ఆ పార్టీకి 18 మంది సభ్యులున్నారు. కొత్తగా 14 స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ బలం 32కు చేరుతుంది. పార్టీ ఎమ్మెల్సీల్లో 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. అందులోనూ 50 శాతం మంది మహిళలు ఉండేలా కొత్త అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి:

CM'S MEETING: సమస్యల పరిష్కారానికి సీఎస్​లతో సంయుక్త కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.