అవినీతి, ఆర్థిక నేరాల కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్న సుప్రీం ఆదేశాలతో సీఎం జగన్ కు భయం పట్టుకుందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. దేశంలోని హైకోర్టుల నుంచి ఈ తరహా కేసుల కార్యాచరణ కూడా సుప్రీం కోర్టు సిద్ధం చేయాలని చెప్పిందని గుర్తు చేశారు. విచారణకు భయపడిన జగన్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని యనమల ధ్వజమెత్తారు. అందులో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘం, ఏసీబీ విచారణలు తెరపైకి తెచ్చారని అన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనపై విచారణ అనటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. అది చట్ట వ్యతిరేకం కాబట్టే హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామన్న యనమల... పత్రికా హక్కుల గురించి ప్రకటన ఇచ్చే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: