ETV Bharat / city

'కొవిడ్ నివారణా ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

రాష్ట్రంలో రెండు దశల్లో కొవిడ్ నివారణకు ప్రభుత్వం చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కరోనా తొలిదశలో ఏపీ ఆర్థిక వృద్ధిరేటు 4.3 శాతానికి పడిపోయిందని.. రెండో దశతో ఏపీలో తిరోగమన వృద్ధి ఖాయమన్నారు. కరోనా కన్నా జగన్‌ బాధ్యతారాహిత్యమే ఏపీకి చేటు చేసిందని ఆయన ఆక్షేపించారు.

yanamala rama krishnudu comments on fainancial condition of andhra pradesh

author img

By

Published : May 15, 2021, 1:41 PM IST

రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై వైకాపా ప్రభుత్వ పాలన దుష్ప్రభావాన్ని చూపిందని తెదేపా సీనియర్​ నేత యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. భవిష్యత్తులో కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెడుతున్నాయని హెచ్చరించారు. కొవిడ్ నివారణకు ప్రభుత్వం చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కరోనా రెండో దశతో ఏపీలో తిరోగమన వృద్ది ఖాయమని యనమల అభిప్రాయపడ్డారు. ద్రవ్యలోటు, ఆదాయలోటు, అధిక అప్పులే సీఎం ఘనత అని ఎద్దేవా చేశారు. 2021-22 ప్రతిపాదిత బడ్జెట్ తప్పుడు లెక్కలే తప్ప రాష్ట్రాన్ని ఆర్ధికంగా నిలబెట్టేది కాదని స్పష్టంచేశారు. ఈ ఆర్ధిక సంక్షోభం దుష్ఫలితాలతో మరో 3ఏళ్లు రాష్ట్రం అతలాకుతలం అవుతుందన్నారు.

అభివృద్ధికి గండికొట్టి.. పేద‌ల ఉపాధి, రాబ‌డుల‌ను చావు దెబ్బ తీశార‌న్నారు. ద్ర‌వ్య‌లోటు, అధిక అప్పులే జ‌గ‌న్ ఘ‌న‌త అని ఎద్దేవా చేశారు. తిరోగ‌మ‌న పాల‌కుడిగా జ‌గ‌న్ పేరు రికార్డుల్లో నిలిచిపోతుంద‌ని య‌న‌మ‌ల అన్నారు.

ఇదీ చదవండి:

భయమే శత్రువు.. కోలుకోవడానికి మనోస్థైర్యమే మందు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.