రాజధాని తరలింపు న్యాయపరిధిలో ఉందనే సమాధానం కేంద్రం నుంచి ఎదురైందని.. అమరావతి రాజధానిగా కొనసాగాలనేది న్యాయమైన అంశమని యనమల రామకృష్ణుడు అన్నారు. వైకాపా తప్ప రాష్ట్ర ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సెలక్ట్ కమిటీని అడ్డుకునేందుకు వైకాపా అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మండలి కార్యదర్శి కూడా ఛైర్మన్ ఆదేశాలు పాటించకుండా వైకాపా నియంత్రిస్తోందన్నారు. సెలక్ట్ కమిటీ దస్త్రం వెనక్కి పంపటం ద్వారా ఉల్లంఘనకు పాల్పడ్డారని యనమల విమర్శించారు. ఛైర్మన్, సభాపతికి శాసన పరిషత్ ఇచ్చిన అధికారాలు ఎవరూ ధిక్కరించలేనివని గుర్తు చేశారు. క్రమశిక్షణ చర్యల కింద కఠిన నిర్ణయం తీసుకునే అధికారం ఛైర్మన్‌కు ఉందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపడం కుదరదు'