ETV Bharat / city

'శాసనమండలిలో బిల్లు ప్రవేశపెడితే.. అప్పుడు చెప్తాం' - యనమల రామకృష్ణుడు తాజా వార్తలు

పాతబిల్లులకు ఎలాంటి సవరణ లేకుండా తిరిగి ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లు ఉందని ఏజీ కోర్టుకు చెప్పారని గుర్తుచేసిన యనమల.. మండలిలో బిల్లును ఎలా అడ్డుకుంటామో వాళ్ళే చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.

yanamala
yanamala
author img

By

Published : Jun 17, 2020, 12:34 PM IST

ఎలాంటి సవరణలు లేకుండా మళ్లీ పాతబిల్లులు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వం మొదటి నుంచీ.. రాజధాని మార్పుపై దురుద్దేశంతో ఉందని ఆరోపించారు. సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లు పెండింగ్​లో ఉండగా మళ్లీ సీఆర్డీయే చట్టం రద్దు, వికేంద్రీకరణ బిల్లులు తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజాభీష్టానికి ఇది వ్యతిరేకమన్న యనమల.. రెండోసారి బిల్లులు పాస్ చేసి మళ్లీ మండలికి పంపటం సరికాదని హితవుపలికారు. సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లు ఉందని ఏజీ కోర్టుకు చెప్పారని గుర్తుచేసిన యనమల.. మండలిలో బిల్లును ఎలా అడ్డుకుంటామో వాళ్ళే చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: సరిహద్దు ఘర్షణలో చైనా అధికారి సహా 16 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.