ETV Bharat / city

రేపటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. - yadadri temple latest news

దట్టమైన అడవిలోన.. ముళ్లపొదల బాటలోన... ఓ నరసింహా మనసారా నిన్నుచూడ.. మా మొక్కుల నప్పజెప్ప.. ఓ నరసింహా సద్దిమూట గట్టుకోని.. నడుచుకుంట వస్తమయ్య.. ఓ నరసింహా - అని పాడుకుంటూ తెలంగాణలోని యాదగిరిగుట్ట మీదికి సన్నటి కాలిబాటలో గుంపులు గుంపులుగా సాగిపోయేవారు భక్తులు ఒకప్పుడు. ఆ రోజుల్లో అదంతా అడవే. రాను రాను రద్దీ పెరిగి గుట్ట మీదికి మార్గం ఏర్పడింది. అయినా ఓ పదేళ్ల క్రితం గుట్టకు వెళ్లినవాళ్లు ఇప్పుడు మళ్లీ వెళ్తే తాము వచ్చింది యాదగిరిగుట్టకేనా అని ఆశ్చర్యపోవాల్సిందే..! ఎత్తైన గోపురాలతో, విశాలమైన ప్రాంగణాలతో, రమణీయమైన శిల్ప సంపదతో యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయం పునర్నిర్మాణం దాదాపు పూర్తి చేసుకుని, రేపటి నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు రారమ్మని భక్తులను పిలుస్తోంది.

YADADRI
YADADRI
author img

By

Published : Mar 14, 2021, 11:44 AM IST

మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయా యాదాద్రీశాయ మంగళం మంగళా శాసన శ్లోకం.. మంద్రంగా వినిపిస్తుంటే సౌభాగ్య ప్రదాయిని లక్ష్మీదేవితో కొలువైన ఆ భక్తసులభుడు నరసింహుడిని దర్శించుకోవడం భక్తులకు అద్భుతమైన అనుభూతి. మనిషి బుద్ధిబలానికీ సింహం దేహ బలానికీ సంకేతం కాగా ఆ రెండు శక్తులతో స్తంభోద్భవుడైన నరసింహుడి దివ్య నిలయం ఇప్పుడు సువిశాల ప్రాంగణాలతో సరికొత్తగా విరాజిల్లుతోంది.

యాదర్షి కోరిక మేరకు నృసింహుడు శాంతస్వరూపంలో లక్ష్మీసమేతంగా దర్శనమివ్వడమే కాక జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్రనరసింహ రూపాల్లో సాక్షాత్కరించి స్వయంభువుగా ఉద్భవించినందునే- మహిమాన్వితమైన ఈ నేల పంచనారసింహ క్షేత్రంగా పేరొందింది. ఈ ఐదు రూపాల్లో- జ్వాలా నరసింహుడూ యోగానందుడూ లక్ష్మీ నరసింహుడూ కొండగుహలో కొలువుదీరారనీ, గండభేరుండ స్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయుడితో కలిసి పూజలు అందుకుంటున్నాడనీ భక్తుల నమ్మకం. అభౌతికరూపుడైన ఉగ్ర నరసింహుడు తేజోవలయంగా కొండచుట్టూ ఆవరించి ఉన్నాడంటారు. యాదర్షి పేరుతోనే యాదగిరిగుట్టగా పేరొందిన ఈ క్షేత్రానికి చాలా చరిత్ర ఉంది. పలు ఆధ్యాత్మిక క్షేత్రాల్లాగే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహుడినీ ఎందరో రాజులు కొలిచారు.

యాదాద్రి ఆలయం

క్రీ.శ.1148లోనే పశ్చిమ చాళుక్యరాజు త్రిభువన మల్లుడు యాదగిరీశుడిని దర్శించుకున్నాడని భువనగిరి కోటలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత కాకతీయ గణపతి దేవుడూ, శ్రీకృష్ణదేవరాయలూ స్వామిని అర్చించి తరించారనీ, కీకారణ్యంలా ఉన్న దారిని దాటి కొండమీదకు చేరడానికి భక్తులు పడుతున్న కష్టాలను చూసి నిజాం రాజులు కొండమీదికి బాట వేశారనీ చరిత్ర చెబుతోంది. అలా కాస్త దారి ఏర్పడడంతో ఎక్కడెక్కడినుంచో భక్తులు తరలిరావడం ఎక్కువయ్యింది. మనిషి నిటారుగా నిలబడడానికి కూడా వీలుకాని గుహే స్వామివారి గర్భగుడి కాగా చుట్టూ జీర్ణదశలో ఉన్న మందిర ప్రాంగణాన్ని హైదరాబాద్‌కి చెందిన మోతీలాల్‌ పిత్తి, పన్నాలాల్‌ పిత్తి అనే దాతలు వందేళ్ల క్రితం పునరుద్ధరించారు. 1959లో ఇక్కడ మహాయాగం నిర్వహించిన పెద్ద జీయర్‌ స్వామి సూచనల మేరకు లక్ష్మీదేవి మందిరం, తూర్పు రాజగోపురాలను నిర్మించారు. రాను రాను పెరుగుతున్న భక్తుల రద్దీకి తగినట్లుగా ఆ తర్వాత గుట్ట మీద సౌకర్యాలు అభివృద్ధి చెందకపోవడంతో ఆ దిశగా దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం.

ఆలయ పునర్నిర్మాణానికి ప్రత్యేకంగా యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వైటీడీఏ)ని ఏర్పాటుచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృఢసంకల్పానికి వైష్ణవ పీఠాధిపతి చినజీయర్‌ స్వామి సలహాలూ సూచనలూ తోడు కాగా వైటీడీఏ ఆధ్వర్యంలో 2016 అక్టోబరు 11న ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. శతాబ్దాల నాటి ఆలయంలో గర్భగుడిని అలాగే ఉంచి దానిచుట్టూ విశాల మందిర ప్రాంగణాన్ని నిర్మించారు. గతంలో మందిరం చుట్టూ ఉన్న పాత కట్టడాలన్నిటినీ తొలగించి ఇప్పటి అవసరాలకు తగినట్లుగా అన్ని వసతులతో యాదాద్రిని అద్భుతమైన ఆలయనగరంగా తీర్చిదిద్దుతున్నారు.

ఐదేళ్లలోపే...

ఐదేళ్లలోపే...
రాతితో ఒక ఆలయాన్ని నిర్మించడానికి ఒకప్పుడు దశాబ్దాలు పట్టేది. అలాంటిది యాదాద్రి ఆలయాన్ని ఐదేళ్లలోపలే పూర్తిచేయడం విశేషం. దాదాపు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో పాంచరాత్ర, ఆగమ, శిల్ప, వాస్తు శాస్త్రాల ప్రకారం మొత్తంగా నల్లని కృష్ణశిల(గ్రానైట్‌)తో నిర్మించడానికి గాను ప్రతిభావంతులైన శిల్పులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యం అక్కరకొచ్చింది. ప్రధాన స్థపతి డాక్టర్‌ ఆనందాచారి వేలు, స్థపతి సలహాదారులు సౌందరరాజన్‌, ప్రఖ్యాత కళాదర్శకులు ఆనందసాయి తదితరుల ఆధ్వర్యంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొన్ని వేలమంది చేయితిరిగిన శిల్పులు ఈ మహాక్రతువులో భాగస్వాములయ్యారు. భక్తజనబాంధవుడైన యాదగిరీశుడి గర్భాలయ వాకిట ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడి కిరణాలు పడేలా, సాయంత్రం వేళ ఆ అపురూపమైన దృశ్యాన్ని భక్తులు వీక్షించడానికి వీలుగా ఆలయాన్ని నిర్మించారు. సిమెంటు, ఇటుకలు వాడకుండా ఆధారశిల నుంచి గోపుర శిఖరాల వరకూ అచ్చంగా రాతితో వెయ్యేళ్లు నిలిచేలా కట్టిన ఆలయమిది. రాళ్ల మధ్య అతకడానికి కరక్కాయ, బెల్లం, కలబంద, సున్నం, జనపనారల మిశ్రమాన్ని వాడారు. దాదాపు 1200 కోట్ల అంచనా వ్యయంతో పునరుద్ధరణ పూర్తిచేసుకుంటున్న ఈ నృసింహక్షేత్రంలో మరెన్నో విశేషాలున్నాయి.

కృష్ణశిలానిర్మితం

కృష్ణశిలానిర్మితం
యాదాద్రి దేవాలయాన్ని అచ్చంగా కృష్ణశిలలతో కడుతున్నారట... అని అబ్బురంగా చెప్పుకున్న భక్తులు ఆ కృష్ణశిలానిర్మిత ఆలయశోభని త్వరలోనే కనులనిండుగా దర్శించవచ్చు. కొండను చుడుతూ పైకి దారి చూపే వలయ రహదారుల మీద వెళ్తుంటే అల్లంత దూరం నుంచి కన్పించే దేవాలయ గోపురాలు భక్తుల్లో ఒక్కసారిగా ఆధ్యాత్మిక భావన పెల్లుబికేలా చేస్తాయి. పైకి చేరుకోగానే నలుదిశలా రాజగోపురాలు ఆవిష్కృతమవుతాయి. ఆలయ గోపురాలలో మొత్తం 16 రకాలుంటే యాదాద్రిలో మూడు రకాల గోపురాలను నిర్మించారు. అవే త్రితల, పంచతల, సప్తతల గోపురాలు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో 55 అడుగుల ఎత్తులో పంచతల గోపురాలనూ, ఈశాన్యం వైపు ఆలయ ప్రథమ మాడ వీధిలో ప్రవేశమార్గంగా 33 అడుగుల ఎత్తులో త్రితల రాజగోపురాన్నీ నిర్మించారు. ఇక, రెండో మాడవీధి ప్రాకారం పడమర దిశలో ఏడు అంతస్తుల మహారాజగోపురం 72 అడుగుల ఎత్తులో ఠీవిగా దర్శనమిస్తుంది. గోపురాలలో అంతస్తుల మధ్య కిటికీల్లాంటి నిర్మాణం వల్ల- గాలి ఎంత వేగంగా వీచినా గోపురాలకు ఎలాంటి నష్టం జరగదు.

ముఖద్వారం

తూర్పు, పడమర దిశల్లో ద్వారాలకు ఇరువైపులా మహాబలిపురం నుంచి తెప్పించిన ఏనుగుల ప్రతిమలూ వాటి పక్కనే జయవిజయుల శిల్పాలూ స్వాగతం చెబుతాయి. ఉత్తర, దక్షిణ దిశల్లో ద్వారాల పక్కన శిలానిర్మిత సింహాలున్నాయి. ఇక స్వామివారి గర్భాలయంపై 45 అడుగుల ఎత్తులో నిర్మించిన విమానం అష్టభుజ రూపంలో ఉంటుంది. దాని మీద సుదర్శన చక్రంతోపాటు పలు దేవతా రూపాలను చెక్కారు. దీన్ని స్వర్ణకవచంతో తీర్చిదిద్దనున్నారు. ఇలా శిల్పాల నుంచి గోపురాల వరకూ అన్నిటినీ అద్భుతంగా ఆవిష్కరించడానికి కృష్ణ శిలనే వాడడానికి కారణం ఉంది. ఈ రాతితో కట్టిన నిర్మాణం ఎన్ని వందల ఏళ్లయినా చెక్కుచెదరదని చెన్నై ఐఐటీ ధ్రువీకరించాకే ఆలయ నిర్మాణానికి దీన్ని ఎంచుకున్నారు. ఈ రాయి వేసవిలో చల్లదనాన్నీ శీతాకాలంలో వెచ్చదనాన్నీ ఇస్తుంది. పైగా ఏ రకమైన ప్రకృతి విపత్తు సంభవించినా తట్టుకుని నిలిచే ఈ శిలను దేవాలయాల నిర్మాణానికి వాడడం అనాదిగా వస్తోంది. యాదాద్రి ఆలయం కోసం రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిలను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం ప్రాంతాలనుంచి సేకరించారు.

కొలువుదీరిన కళాకృతులు

కొలువుదీరిన కళాకృతులు
అష్టభుజ మండప ప్రాకారాలు, యాలీ స్తూపాలు, అష్టలక్ష్మీరూపాలతో సాలహారాలు, కాకతీయులనాటి శిల్పవైభవం, వైష్ణవ తత్త్వాన్ని విశ్వమంతా చాటిన ఆళ్వారుల విగ్రహాలు, ప్రహ్లాద చరితం, ఉప ఆలయాలు... ఎటు చూసినా మనసును మైమరిపించే అద్భుత సౌందర్యంతో దాదాపు నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన మాడవీధులతో నారసింహనిలయం నభూతో నభవిష్యతి అన్నట్లుగా రూపొందింది. ఆలయ ముఖ మండపం రెండంతస్తులుగా ఉండి ఏకంగా రాజభవనాన్ని తలపిస్తుంది. రెండు పక్కలా 18 అడుగుల ఎత్తున 12 మంది ఆళ్వారుల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ఒక్కో విగ్రహాన్నీ ఒక్కో శిలతో ఎంతో నైపుణ్యంతో చెక్కారు. ఆళ్వారుల మండపంపైన పొందుపరిచిన కాకతీయ కళా స్తూపాలు సైతం ఏకశిలతోనే నిర్మితమయ్యాయి. వాటి మీద కూడా దేవతా రూపాలనూ నాట్య భంగిమలనూ అందంగా చెక్కారు. దైవదర్శనం అనంతరం భక్తులు మందిర ప్రాంగణంలో విహరిస్తూ తనివితీరా ఆ అందాలను ఆస్వాదించవచ్చు. స్వామివారి గర్భగుడి ప్రవేశ ద్వారం పైభాగాన వరసగా పంచలోహ పలకలపై చిత్రించిన ప్రహ్లాదచరిత్ర ఆకట్టుకుంటుంది. తల్లి గర్భంలో ఉండి నారదమహర్షి మాటలు వినడం, గురువుల చెంత విద్యాభ్యాసం, తండ్రి అయిన హిరణ్యకశ్యపుడికి నారాయణుడి లీలలను వర్ణించడం, తండ్రి పెట్టించిన హింసలు, హరి సర్వాంతర్యామి అంటూ స్తంభాన్ని చూపడం, దాంట్లోనుంచి నరసింహుడు ఉద్భవించి హిరణ్యకశ్యపుడిని సంహరించడం... ఇలాంటి ఘట్టాలన్నీ ఆ పలకలపై ఉండి స్వామి దర్శనానికి క్యూలో వేచివుండే భక్తులకు కనువిందు చేస్తాయి.

పడమటి రాజగోపురం ముందుభాగంలో స్వామివారి వేంచేపు మండపం, తూర్పు రాజగోపురం ముందు భాగంలో బ్రహ్మోత్సవ మండపం ఉంటాయి. దేవాలయం చుట్టూ స్వామివారి రథం తిరిగేందుకు వెసులుబాటు కల్పించారు. కొండమీదికి ముప్పై నలభై వేల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేనివిధంగా ఈ ఏర్పాట్లు ఉన్నాయి.

మొక్కులూ వ్రతాలూ...

మొక్కులూ వ్రతాలూ...
యాదాద్రి నరసింహస్వామి సన్నిధిలో భక్తులు ఎన్నో విధాలైన పూజలూ వ్రతాలూ జరుపుతారు. మొక్కులు చెల్లించుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన ఘట్టం. తాము ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలనుంచి రక్షించమని వేడుకుంటూ మొక్కుకున్న మొక్కులను చెల్లించుకోడానికి సుదూర ప్రాంతాలనుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. బాధలనుంచి విముక్తికోసం ప్రదక్షిణలు చేస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పసుపు కొమ్ములు చేతబూని స్వయంభువులకు 16, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి 16 చొప్పున ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. ఈ ప్రదక్షిణలకు కూడా మొక్కు ఉంటుంది. 5, 11, 21, 40 రోజులు... ఇలా ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకున్న భక్తులు అన్ని రోజులూ గుట్టమీద బస చేసి ఆ మొక్కు తీర్చుకుంటారు.

సత్యనారాయణ స్వామి వ్రతాలకు మరో అన్నవరం లాంటిది ఈ నారసింహ క్షేత్రం. వ్రతం చేసుకోవాలనుకునే భక్తుల రద్దీని తట్టుకోవడానికి ఇక్కడ రోజూ నాలుగు దఫాలు, ఒక్కో దఫాలో 250 జంటలు వ్రతం చేసుకునే వీలును కల్పించారు. వ్రతం చేసుకోదలచినవారు టికెట్‌ తీసుకుంటే వ్రతానికి అవసరమైన పూజాసామగ్రిని దేవస్థానమే అందిస్తుంది. శ్రావణ, కార్తిక మాసాల్లో ఈ వ్రతం మొక్కులు చెల్లించుకునే భక్తుల రద్దీ ఎక్కువ. ఆ రెండు నెలలూ అయితే రోజుకు ఆరు దఫాలుగా వ్రతాలు నిర్వహిస్తారు. పునర్నిర్మాణంలో భాగంగా వ్రతాలు చేసుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా గుట్ట కింద గండి చెరువు వద్ద ఒక పెద్ద వ్రతమండపాన్ని నిర్మిస్తున్నారు.

నరసింహస్వామివారి ఆలయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు సుప్రభాతంతో మొదలైన సేవలు రాత్రి తొమ్మిదిన్నర వరకూ కొనసాగుతాయి. ఇతర దేవాలయాల్లో లాగే ఇక్కడి స్వామివారికి భక్తుల కోరిక మేరకు పలు ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు సుదర్శన నారసింహ హోమం, పది గంటలకు లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణం జరుగుతాయి. యాదాద్రీశుడి ప్రసాదంగా లడ్డూ, పులిహోరలను భక్తులకు అందజేస్తారు.

కొండకిందే కోనేరు

కొండకిందే కోనేరు
ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులకు అవసరమైన సకల సౌకర్యాలనూ కల్పిస్తున్నారు. యాదాద్రి కొండని కేవలం దేవాలయానికి మాత్రమే కేటాయించి బసతో సహా అన్ని కార్యక్రమాల్నీ భక్తులు కొండ కిందే ముగించుకునేలా ఏర్పాట్లు చేశారు. విష్ణు పుష్కరిణిగా పేరొందిన ఇక్కడ పుష్కరిణిలో పుణ్యస్నానాలకు చాలా ప్రాధాన్యమిస్తారు భక్తులు. అది సాక్షాత్తూ ఆ దేవదేవుడి పాదాల నుంచీ ఉద్భవించిన గంగ అనీ అందులో స్నానమాచరిస్తే సకల పాపాలూ తొలగిపోతాయనీ ఆరోగ్యం సిద్ధిస్తుందనీ నమ్ముతారు. బ్రాహ్మీ ముహూర్తంలో మహర్షులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి వేదమంత్రాలు జపిస్తూ లక్ష్మీనరసింహుడిని దర్శించుకోవటానికి వెళ్తారనీ ఆ సమయంలో మృదంగ ధ్వనులు వినిపిస్తాయనీ చెబుతారు. అయితే క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఇప్పుడు కొండపైన పునరుద్ధరించిన విష్ణుపుష్కరిణిని దైవ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించనున్నారు. భక్తుల పుణ్యస్నానాల కోసం కొండకింద గండిచెర్ల చెంత లక్ష్మీ పుష్కరిణిని నిర్మిస్తున్నారు. బస కోసం తులసితోట ప్రాంతంలో కాటేజీలతో కలుపుకుని మొత్తం 250 గదులను నిర్మిస్తున్నారు. యాదాద్రి సమీపంలో పెద్దగుట్టగా పిలిచే ప్రాంతాన్ని ఆలయనగరిగా అభివృద్ధి చేయడానికి సుమారు వెయ్యి ఎకరాలను సేకరించారు. ఇప్పటికే 250 ఎకరాల్లో లేఅవుట్‌ పనులను చేపట్టారు.

ఆధ్యాత్మికత.. ఆహ్లాదం

ఆధ్యాత్మికతకు ఆహ్లాదమూ తోడైతే భక్తులకు ఆ అనుభూతి చిరస్మరణీయంగా మిగిలిపోతుందని భావించిన వైటీడీఏ పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచేందుకు చెట్లను నాటింది, ఉద్యానవనాలను తీర్చిదిద్దుతోంది. దాదాపు 75 ఎకరాలను అందుకే కేటాయించడం విశేషం. ఆలయ సందర్శనకు వచ్చే ప్రముఖుల బస కోసం ఆధునిక వసతులతో ప్రెసిడెన్షియల్‌ సూట్లు, విల్లాలను నిర్మిస్తోంది. రోడ్డు, రైలు మార్గాల్ని అనుసంధానం చేయడమే కాకుండా హెలిప్యాడ్లతో సహా సకల హంగులూ ఈ ఆలయనగరికి
అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.

అనుభూతి అదే..!

అనుభూతి అదే..!
ఎంత కొత్తగా కట్టినా భక్తులకు అలవాటైన అలనాటి ఆలయ వాతావరణమూ స్వామివారి దర్శన అనుభవాల్లో మార్పు లేకుండా చూసుకోవడం విశేషం. వైటీడీఏ అధికారులు ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రధానాలయంలో ఎప్పటిలాగే ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడాలయం, ఆండాళ్‌ అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. నాలుగంతస్తుల భవనసముదాయంలో ఒక్కో అంతస్తులో రెండు విశాలమైన భవనాల్లో 20వేల మంది ఒకేసారి వేచిఉండేలా క్యూకాంప్లెక్స్‌ని నిర్మించారు. ఇత్తడితో ఏర్పాటుచేసిన క్యూలైన్లు, పర్యవేక్షణకు సీసీ కెమెరాలు, చల్లదనానికి ఏసీలు, మంచినీటి సదుపాయం... లాంటివన్నీ పక్కాగా ఉన్నాయి. స్వామివారికి నివేదించే ప్రసాదం నేరుగా లిఫ్ట్‌ ద్వారా ఆలయంలోకి వచ్చే ఏర్పాటుచేశారు. గర్భాలయ ద్వారాన్ని బంగారంతోనూ, ఉపాలయాల ద్వారాలను వెండితోనూ తాపడం చేస్తున్నారు.

ఆహ్లాదకరమైన అనుభూతి..

మనసంతా ఇష్టదైవం మీద నిలిపి గోవింద నామస్మరణం చేస్తూ ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు భక్తులు. వారికి ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే ఆధ్యాత్మిక యాత్రగా స్మృతిపథంలో చిరకాలం నిలిచిపోయేందుకు కావలసిన అన్ని హంగులతో రూపు దిద్దుకుంటున్న యాదాద్రి వైభవాన్ని చూడడానికి ఇంకెందుకూ ఆలస్యం..!

బ్రహ్మోత్సవ శుభవేళ

బ్రహ్మోత్సవ శుభవేళ

యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. పదకొండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు మార్చి 15న- అంటే, రేపు మొదలై 25న ముగుస్తాయి.
భక్తోత్సవాల పేరిట వేడుకలు జరపడం యాదగిరిగుట్టపై కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. తొలుత మూడురోజులూ ఆ తర్వాత ఐదు రోజులూ జరిగిన ఈ ఉత్సవాలు చివరికి 11రోజుల బ్రహ్మోత్సవాలుగా రూపుదాల్చాయి. 1975 నుంచి ఈ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. వైష్ణవాలయాల్లో స్వామివారి నిత్యకైంకర్యాలకూ ఉత్సవాలకూ ఎంత ప్రాధాన్యం ఉంటుందో దేవేరులతో కూడిన స్వామిని అలంకరించడానికీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. అందుకే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని రోజుకో రూపంలో అలంకరించి చూసు కుంటారు భక్తులు. పాంచరాత్ర ఆగమ పద్ధతిలో జరిగే ఈ ఉత్సవాలు విష్వక్సేనుడి పూజతో మొదలై అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగుస్తాయి. ఉత్సవాలు నిరాటంకంగా జరిగేలా చూడమంటూ సేనాధిపతి విష్వక్సేనుడిని పూజిస్తారు. రెండో రోజు ధ్వజారోహణమూ రాత్రి భేరీపూజ, మూడోరోజు వేదపారాయణ, నాలుగోరోజు హంసవాహనసేవ, ఐదో రోజు కల్పవృక్ష సేవ, ఆరో రోజున గోవర్ధన గిరి అవతారం, ఏడో రోజున స్వామివారి కల్యాణానికి ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున జరిగే స్వామివారి కల్యాణం చూడడానికి రెండు కళ్లూ చాలవు. తొమ్మిదో రోజు వైభవంగా రథోత్సవం, పదో రోజున చక్రస్నానం, చివరి రోజున అష్టోత్తర శతఘటాభిషేకం.. నిర్వహిస్తారు.

ఇదీ చూడండి: నూజివీడులో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.