యాదాద్రి ఆలయల గర్భాలయంపై 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన విమానానికి (విమాన గోపురం) బంగారు తాపడం (Yadadri Temple Development Works) చేయించాలని యాడా నిర్ణయించింది. దీని కోసం సుమారు 60 కేజీల బంగారం అవసరమవుతుందని యాడా, ఆలయ అధికారులు అంచనా వేశారు. దానిని దాతల నుంచి సేకరించాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో గీత సోమవారం తెలిపారు.
ఈ మేరకు దాతలు ముందుకు రావాలని ఆమె కోరారు. ఉత్సవ మూర్తుల నిత్య ఉత్సవాలకు వినియోగించే కొయ్య రథానికి స్వర్ణ తొడుగులు అమర్చే పనులు తుదిదశకు చేరుకున్నాయి. రాగి తొడుగుల తయారీ పూర్తయింది. వాటికి బంగారు తాపడం చేసి.. టేకు రథానికి అమర్చే పని మిగిలింది. దీనిని పది రోజులలో పూర్తి చేస్తామని ఈ పనులు చేస్తున్న చెన్నైకు చెందిన స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ వెల్లడించిందని గీత చెప్పారు. ఈ నెలాఖరు లోపు రథం యాదాద్రికి చేరుకునే అవకాశముందన్నారు. స్వర్ణ రథానికి అయ్యే రూ.60 లక్షల ఖర్చును శ్రీలోగిళ్లు, ల్యాండ్‌మార్క్ రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలు సురేశ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి భరిస్తున్నారు.
యాదాద్రీశుడి పుణ్యక్షేత్రాభివృద్ధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రీశుడి పుణ్యక్షేత్రాభివృద్ధి(Yadadri Temple Development Works)కి శ్రీకారం చుట్టి ఐదేళ్లు కావొస్తోంది. ఈ క్షేత్రాన్ని విశ్వఖ్యాతి చెందేలా రూపొందించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానాలయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు. గత జూన్ 21న క్షేత్రాన్ని సందర్శించిన ఆయన అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. ఆయన జారీ చేసిన ఆదేశాలతో పనులను చకాచకా పూర్తి చేస్తున్నారు.
క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించి, ఆలయ ఉద్ఘాటనకు ముహూర్తం నిశ్చయానికి రాష్ట్ర సీఎం కేసీఆర్ త్వరలో ఇక్కడికి వస్తున్నారని యాదాద్రిలో ఏర్పాట్లు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. స్థానిక మున్సిపల్ పారిశుద్ధ్యం కార్మికులు గండిచెరువు పరిసరాల్లోని దారుల్లో మట్టి తొలగించి ఊడ్చే పనులు చేపట్టారు. యాడా ఆధ్వర్యంలో కనుమదారుల్లో ఇరువైపులా మొక్కలు నాటారు. మట్టి దారులను మెరుగుపరుస్తున్నారు. ప్రధాన రహదారి విస్తరణ, వైకుంఠ ద్వారం వద్ద సర్కిల్‌ను తీర్చిదిద్దుతున్నారు. కొండపైన ర్యాంపు నిర్మిస్తున్నారు. ఆలయం చెంత స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి:
Yadadri: నయనానందకరం... భక్తులకు త్వరలోనే సుందర యాదాద్రి దర్శనం
Yadadri Temple: దసరా నాటికి యాదాద్రి పనుల పూర్తి చేసేందుకు కసరత్తు