పార పట్టి వరి చేలో దమ్ము చేస్తున్న ఈ రైతు పేరు వాంకుడోతు బోడియా. వయసు దాదాపు 90 ఏళ్లు. ఊరు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వాచ్యతండా. వృద్ధాప్యంలోనూ మట్టి వాసన మానలేక తన రెక్కల కష్టంతో ముక్కారు పంటలు పండిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు.
తనకున్న ఐదెకరాల్లో ఇద్దరు కుమారులకు చెరో రెండు ఎకరాలు ఇచ్చారు. మిగిలిన ఎకరంలో సొంతంగా వ్యవసాయం చేస్తూ భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఎక్కువ సమయం పనిచేసుకుంటూ పొలం బావి దగ్గరే ఉంటారని సమీప రైతులు తెలిపారు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేసే అలవాటు, జొన్న రొట్టెల ఆహారం కారణంగానే ఇప్పటికీ పనిచేసుకోగలుగుతున్నానని బోడియా చెప్పారు.
ఇదీ చూడండి: