ETV Bharat / city

అన్ని రంగాల్లోనూ.. 'ఆమె' విజయకేతనం

author img

By

Published : Mar 8, 2020, 7:51 AM IST

ఆడవాళ్లు వంటిల్లు వదిలి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి చాలా ఏళ్లయింది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రొఫెషనల్‌ రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. సామాజిక సేవ నుంచి అంతరిక్షయానం వరకూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పారిశ్రామిక, బ్యాంకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ రంగాల్లో ముందుంటున్నారు. సాహసాలు చేయడంలోనూ తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. సైన్యం, వైమానికం, పోలీసు, క్రీడా రంగాల్లోనూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు.

womens day special
womens day special

మహిళలు అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. విదేశాల్లోనూ భారత మహిళలు తమ సత్తా చాటుతున్నారు. అమెరికాలో టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న పద్మశీ వారియర్‌ ఇందుకు ఒక మంచి ఉదాహరణ. అలాగే హిందీ-ఇండీ మ్యూజిక్‌ను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసి 'ఫలు షా' గొప్ప విజయాలు సాధించింది.

క్రీడల్లో సత్తా...

మేరీకోమ్‌, హర్షిణి ఖన్హేకర్‌, పూజా, థాకూర్‌, షెఫాలీ వర్మ వంటి యంగ్‌ తరంగ్​లు ఉన్నారు. తల్లయినా కూడా బాక్సింగ్‌ పట్ల తనకున్న ప్రేమను మేరీకోమ్‌ వదులుకోలేదు. బాక్సింగ్‌ రంగంలో ఎందరో మహిళలకు స్ఫూర్తిగా మేరీ నిలిచింది. మిథాలీ, హర్మన్​ప్రీత్ కౌర్, స్మృతిమంథాన, షెఫాలీ వర్మ వంటి మహిళా క్రికెటర్లు యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

హర్షిణి ఇండియా తొలి మహిళా ఫైర్‌ ఫైటర్‌. పది సంవత్సరాల క్రితం ఇందులో ఆమె ప్రవేశించింది. ఇక పూజా థాకూర్‌ జీవితం ఎందరో అమ్మాయిలను చైతన్య పరుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇండియా వచ్చినపుడు ఆయన ఎదుట ఇంటర్‌ - సర్వీస్‌ గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ని ముందుండి నడిపించింది పూజ. ఈ అవకాశం పొందిన తొలి మహిళా ఆఫీసర్‌ ఆమె.

సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి మహిళా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. ఆమె అమ్ముల పొదిలో బ్యాడ్మింటన్‌ క్రీడలో సాధించిన ఎన్నో పతకాలు ఉన్నాయి. ఇదే బాటలో సింధు పయనిస్తోంది. అలాగే దీపికా పల్లికల్‌ స్క్వాష్‌ క్వీన్‌. టాప్‌ 10 వరల్డ్‌ స్క్వాష్‌ అసోసియేషన్‌ ర్యాంకింగ్స్‌లో స్థానం పొందిన తొలి భారతీయురాలు. తానియా సచిదేవ్‌ చెస్‌లో భేష్ అనిపించుకుంది. అర్జున అవార్డు సాధించింది.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో హవా...

శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను చాటిన ఎందరో మహిళా శాస్త్రవేత్తలు మనదేశంలో ఉన్నారు. వారిలో పాతతరం జానకి అమ్మాల్‌ ఒకరు. వెస్ట్రన్‌ మెడిసెన్‌ డిగ్రీ సాధించిన తొలి భారతీయ మహిళ ఆమె. అలాగే అసిమా ఛటర్జీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫైటో మెడిసిన్‌ల్లో గొప్ప సేవలను దేశానికి అందించింది. మరొకామె సునేత్ర గుప్త. ఆమె థీరిటికల్‌ ఎపిడెమియోలజీలో ప్రొఫెసర్‌గా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పనిచేసింది. సునేత్ర ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ మీద, ఫ్లూ, మలేరియా మీద మ్యాథమెటికల్‌ మోడల్స్‌ను ఉపయోగించి పరిశోధనలు నిర్వహించింది.

ఇందిరా హిందూజ భారతదేశపు తొలి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ పుట్టుకకు కారణమైంది. ఆమె గైనకాలజిస్టు, ఆబ్‌స్టెట్రీషియన్‌ మాత్రమే కాదు ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు కూడా. ఆమె చేసిన పలు సైంటిఫిక్‌ అధ్యయనాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సుమన్‌ సహాయ్‌ జెనీ క్యాంపెయిన్‌ అనే సంస్థను స్థాపించింది. ఈ ఫౌండేషన్‌ ఆహారం, న్యూట్రిషన్‌, లైవ్లీహుడ్‌ మీద పనిచేస్తుంది. ఆమెకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈమె చేసిన కృషి కారణంగానే జన్యు సంబంధమైన పంటలపై, వాటివల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది.

సాహసాల్లోనూ అతివల సత్తా

సైన్స్‌, క్రీడలు, కళ, సాహిత్య రంగాల్లోనే కాదు సాహసాలు చేయడంలోనూ భారత స్త్రీలు ముందుంటున్నారు. ఎవరెస్టులాంటి పర్వతాలెక్కారు. ఇంగ్లీషు ఛానల్​ను ఈదారు. దేశంలో అతిక్లిష్టమైన మంచుకొండలనూ అవలీలగా అధిరోహించారు. విశేషమేమిటంటే ఈ సాహసకృత్యాలను ఒంటి కాలితో చేసిన భారతీయ మహిళలు కూడా ఉన్నారు.

మౌంట్‌ ఎవరెస్టును తొలిసారి ఎక్కిన మహిళగా బచేంద్రపాల్‌ రికార్డు సృష్టించారు. అరుణిమ సిన్హా అయితే ఒంటి కాలితో ఎవరెస్టును అధిరోహించిన తొలి మహిళగా రికార్డు నమోదుచేసింది. ఆమె వాలీబాల్‌ ప్లేయర్‌ కూడా. రైలు ప్రమాదంలో ఆమె కాలు పోగొట్టుకుంది.

స్త్రీ పురుషులిద్దరూ అన్ని రంగాల్లో సమానంగా రాణించిన రోజునే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలోని టెక్నాలజీ సంస్థల్లో స్త్రీలు ఎక్కువ కనిపిస్తున్నారు. అంతేకాదు ఇండియాలో 30 శాతం వరకూ ప్రోగ్రామర్స్​గా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.

ఇండియాలోని టెక్నాలజీ సంస్థలు ఆడవాళ్లను ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. నేటి మహిళలు చాలా విషయాల్లో సూపర్‌ ఉమెన్‌ అనిపించుకుంటున్నారు. మల్టీటాస్కింగ్‌ చేస్తూ ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇంటా బయటా కూడా తమ సత్తా నిరూపిస్తూ... అన్ని రంగాల్లోనూ తమ ఉనికిని చాటుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.