ETV Bharat / city

women harassment : 'ఆమె' భయం.. విషనాగులకు బలం - photo morphing of women in Hyderabad

మహిళల్లో భయం.. కొందరు విషనాగులకు బలమవుతోంది. ఎవరేం చేసినా బయటకు చెప్పలేని వారి బలహీనత కొందరు దుర్మార్గులకు అవకాశంగా మారుతోంది. అయినవాళ్లు.. బయటివాళ్లు.. ఇంటా బయటా.. అవకాశం దొరికినప్పుడల్లా వారి ఫొటోలు, వీడియోలు తీసి(women harassment) మార్ఫింగ్ చేస్తున్నారు. డబ్బు కోసమో.. లేదా లోబర్చుకోవడానికో వారిని బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటనలో కొందరు భయపడి వారిని ఎదిరించే ధైర్యం లేక ప్రాణాలు తీసుకుంటుంటే.. ఇంకొందరు తెగువతో ఓ అడుగు ముందుకేసి వారి ఆటకట్టిస్తున్నారు.

Women harassment
Women harassment
author img

By

Published : Sep 25, 2021, 12:16 PM IST

హైదరాబాద్ శివార్లలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ అనారోగ్యంతో చేరారు. తోడుగా వచ్చిన ఇద్దరు మహిళలు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా ఆసుపత్రి వార్డుబాయ్‌.. మంచంపై స్పృహలో లేని మహిళా రోగిని సెల్‌ఫోన్‌తో చిత్రీకరించటం(women harassment) ప్రారంభించాడు. అక్కడకు వచ్చిన సహాయకులు గమనించి కేకలు వేయటంతో స్థానికులు ఆ ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేశారు.

పాతబస్తీకు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఆమె చరవాణికి అశ్లీల చిత్రాలు(Blue films) వచ్చాయి. వాటిలో తానే ఉండటంతో వణికిపోయింది. విషయం తెలిసిన యువకుడు పెళ్లివద్దన్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో షీటీమ్స్‌, సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. యువతిని పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని కాబోయే వరుడే ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పంపినట్టు నిర్ధారించారు.

ఈ తరహా ఘటనల్లో చిత్రీకరించిన దృశ్యాలను బూచిగా చూపుతూ లైంగిక వాంఛలు తీర్చమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వివిధ కారణాలతో బయటకు చెప్పేందుకు మహిళలు వెనుకంజ వేస్తుండటంతో వారి ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అందరికీ తెలిసి పోతుందన్న ఉద్దేశంతో కేసులు వద్దంటూ రాజీ పడుతున్నారు.

ఫిర్యాదులతోనే ఆగడాలకు అడ్డుకట్ట

ఏడాది క్రితం ఓ జంటకు పెళ్లయింది.. భార్యాభర్తల చరవాణులు, మెయిల్స్‌కు అశ్లీలచిత్రాలు(Blue films) వచ్చాయి. ఆమె ప్రవర్తన మంచిదికాదనేది సారాంశం. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో గుట్టురట్టయింది. ఆ మహిళను పెళ్లిచేసుకోవాలని ఆశపడిన మేనమామ కక్ష పెంచుకుని ఇలా చేసినట్టు గుర్తించారు. మహిళల వ్యక్తిగత చిత్రాలు, దృశ్యాలను చిత్రీకరిస్తూ పట్టుబడిన సందర్భాల్లో చుట్టూ ఉన్న వారు కొట్టి, సెల్‌ఫోన్లు లాక్కుని వదిలేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో కుటుంబీకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోతున్నారు. ఇంకొందరు సంసారంలో కలతలు వస్తాయనే భయంతో నోరుమెదపడం లేదని షీ టీమ్స్‌ సమన్వయకర్త డా.మమతా రఘువీర్‌ విశ్లేషించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.