సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఫేస్బుక్లో ప్రకటనలు పెట్టి అమాయకులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ పెట్టుబడి అంటూ హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన మహిళ నుంచి రూ.2.10 లక్షలు కాజేశారు.
ఆన్లైన్ షాపింగ్ పెట్టుబడి అంటూ ఫేస్బుక్లో ప్రకటనను చూసి డబ్బులను పోగొట్టుకున్న ఆదర్శ్ నగర్‌కు చెందిన ఆర్తి ప్రియ పోలీసులను ఆశ్రయించారు. తాము పంపే లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి అందులో పెట్టుబడి పెట్టాలంటూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ చేశారని తెలిపారు. అది నమ్మి పలు దఫాలుగా రూ.2.10లక్షలను చెల్లించినట్లు వెల్లడించారు.
ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయని బాధితురాలు అడగగా... మరికొంత నగదు చెల్లిస్తేనే వస్తాయని అన్నారని పేర్కొన్నారు. లేదంటే డబ్బులు రావని బుకాయించారని వాపోయారు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితురాలు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Suicide: సెల్‌ఫోన్ కొనివ్వలేదని పదేళ్ల బాలుడి ఆత్మహత్య