ETV Bharat / city

'నన్ను ప్రేమించాడు.. ఆమెను పెళ్లాడాడు' - ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా తాజా వార్తలు

తనను ప్రేమించి.. మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ.. ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

marriage
ఒకరితో ప్రేమ మరొకరితో పెళ్లి
author img

By

Published : May 27, 2022, 2:42 PM IST

తనను ప్రేమించి.. మరో యువతిని పెళ్లి చేసుకోవడం ఏంటంటూ.. పెళ్లి బాజాలు మోగిన ఇంటి ముందు ఓ యువతి ధర్నాకు దిగింది. ఈ ఘటన హైదరాబాద్‌ హబ్సిగూడ డివిజన్​లో జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన శ్రీకాంత్‌చారి.. రామంతాపూర్‌కు చెందిన లక్ష్మి(29) 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. శ్రీకాంత్​చారి బుధవారం రోజున మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి.. శ్రీకాంత్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో మోసం చేసిన శ్రీకాంత్​చారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. బాధితురాలికి ఆదర్శ మహిళా సంఘం సభ్యులు మద్దతు తెలిపారు. లక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మహిళా సంఘాల నేతలు తెలిపారు. చివరకు ఈ ప్రేమ, పెళ్లి కథ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.