ETV Bharat / city

చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల టోకరా.. 70మందికి మహిళ మస్కా - Hayatnagar Woman cheating updates

చిట్టీల పేరుతో అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించిన ఓ మహిళ నాలుగున్నర కోట్లకు టోకరా వేసింది. ఈ ఘటన తెలంగాణలోని హయత్​నగర్​ పరిధిలో జరిగింది. 70 మంది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Woman cheated people in the name chits at Hayatnagar in hyderabad
హయత్‌నగర్‌ మహిళ ఫ్రాడ్
author img

By

Published : Apr 5, 2021, 12:49 PM IST

హైదరాబాద్ హయత్​నగర్​లో వివరాలు వెల్లడిస్తున్న చిట్టీల బాధితులు

హైదరాబాద్‌లో చిట్టీల పేరిట మహిళ నాలుగున్నర కోట్లకు టోకరా వేసింది. హయత్‌నగర్‌ పరిధిలోని ప్రగతి నగర్‌లో ఉంటున్న పూలమ్మ అనే మహిళ... చిట్టీలు, అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురి నుంచి డబ్బు వసూలు చేసింది. రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడం వల్ల హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సుమారు 70 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: జనార్దనస్వామి ఆలయంలో చోరీ.. 5లక్షల వెండి ఆభరణాలు అపహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.