బొలీవియా... సౌత్ అమెరికాలోని దేశం ఇది. ఈ కంట్రీలోని లాపాజ్ నగరంలో ఓ ఇల్లు.. ఆ ఇంట్లో ఓ ఘోరమైన పగలు.. నిద్రలో కూడా "పగటి కలలు" కనడం నేరమని ఆ భర్తకు తెలిసి ఉండదు. "తెలిసినా ఏం చేస్తాడు.. నిద్రలో వచ్చే కల అతనికెలా తెలుస్తుంది పాపం.." అంటారా? ఇదే ప్రశ్న అతని భార్యను అడిగితే.. "ఎందుకు తెలియదు? మెలకువగా ఉన్నప్పుడు గాఢంగా దేన్నైతే కోరుకుంటారో.. అదే కలలో వస్తుంది. నాకు తెలియదా ఏంటీ? హమ్మా.." అంటుంది. ఇంతకీ ఆ విషాద పగటిపూట ఏం జరిగిందో తెలుసుకుందాం..
భర్త బెడ్ మీద నిద్రిస్తున్నాడు.. అతని వయసు 45 ఏళ్లు.. గాఢ నిద్రలో ఉన్న అతను మెల్లగా శబ్దం చేయడం మొదలు పెట్టాడు. భార్య దగ్గరికి వచ్చి చూసింది.. "ఏదో కలవరిస్తున్నాడు". చెవులు రెక్కించి మరింత దగ్గరగా వెళ్లి విన్నది. అంతే.. ఒళ్లు మండింది.. పళ్లు కొరికింది.. కళ్లు పెద్దవి చేసింది.. పట్టలేనంత ఆవేశంతో.. ఆగ్రహంతో.. ఉద్రేకంతో.. వంటింట్లోకి పరిగెత్తింది. తనలోని ఫైర్ ను కూడా యాడ్ చేసి.. సెగలు కక్కేంతగా గిన్నెడు నీళ్లు మరిగించింది. ఉడికిపోతున్న ఆ నీటిని పట్టుకొచ్చి.. ఒక్క ఉదుటన నిద్రిస్తున్న భర్త జననాంగంపై కుమ్మరించింది.
అతగాడు పెట్టిన కేకలు అపార్ట్ మెంట్ దాటి.. వీధి చివరి వరకూ వ్యాపించాయి. క్షణాల్లో బజారు మొత్తం వాళ్లింట్లో వాలింది.. భర్త తీవ్ర గాయాలతో అల్లాడిపోతున్నాడు. ఆసుపత్రిలో బర్నాల్ రాసిన డాక్టర్.. బర్నింగ్.. "సెకండ్ స్టేజ్" కూడా దాటిందని చెప్పారు. అంటే.. నీళ్లు ఎంతగా వేడెక్కాయో అర్థం చేసుకోవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితురాలైన భార్యను, బాధితుడైన భర్తను విచారించారు. కేసు ఫైల్ చేసి.. భార్యను జీప్ ఎక్కించారు.
ఆ తర్వాత ఈ కేసు వివరాలను.. లా పాజ్ స్పెషల్ క్రైమ్ ఫైటింగ్ ఫోర్స్ డిప్యూటీ డైరెక్టర్ జువాన్ జోస్ డోనైర్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. "ఈ 45 ఏళ్ల భర్త.. తన భార్య నుండి హింస, వేధింపులు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు" అని చెప్పారు. గతంలో ఇతని భార్య పలుమార్లు ఇలా.. తీవ్రవాద చర్యలకు దిగిందన్నారు. ఓ సారి ఆవేశంలో భర్తపై మద్యం పోసి.. నిప్పంటించే ప్రయత్నం కూడా చేసిందట!
కానీ.. వీరిద్దరి మధ్య ఇంతగా గొడవలు జరగడానికి కారణం ఏంటో తెలియలేదు అని చెప్పారు జువాన్. తొలిసారి వీరిమధ్య ఎక్కడ చెడిందో అర్థం కాలేదని అన్నారు. కానీ.. ఆమె చర్యలు మాత్రం ఊహాతీతంగా ఉంటున్నాయన్నారు. ఇదంతా సరేగానీ.. ఇంతకీ ఆ అమాయకపు భర్త నిద్రలో ఏమని కలవరించారో చెప్పండి అంటారా..? కలలో ఎవరితోనో.. "ఐ లవ్యూ" అన్నాడట!
వీటిపైనా ఓ క్లిక్కేయండి..
- "గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని" రూ.15 లక్షలు ఫైన్ వేసిన జడ్జి..!
- అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!
- మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!
- ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?
- "యువరానర్.. దిసీజ్ వెరీ దారుణం.. ఈ కోడి పుంజును శిక్షించండి".. కోర్టుకెళ్లిన దంపతులు!!
- అక్కడ ఉద్యోగులు తప్పుచేస్తే.. పచ్చి కోడిగుడ్లు, బొద్దింకలు మింగాలి!!
- ఇదేం వింత సామీ.. ఆక్సిజన్ లేకుండానే బతికేస్తోంది..!!
- "మిమ్మల్ని నా బంగారం అనుకున్నా.. ఛీ పోండ్రా.." రాజీనామా చేసిన యువతి..
- ఓ మంచి దేవుడా..! ఎందుకయ్యా గిట్ల చేసినవ్..?!
- అక్కడ వధూవరులను అమ్ముతున్నారు.. "మీలో ఎవరైనా షాపింగ్ చేస్తారా?"
- పోలీస్ స్టేషన్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. మేనేజర్ పోస్టు కావాలట!
- దొంగతనం చేశాను కదా.. నన్ను అరెస్టు చేయాల్సిందే!
- ఆయనకు ఇద్దరు కాదు.. 3.. 4.. 5.. 6.. 7.. 8.. 9.. 10.. 11.. ???
- వాటర్ తో అమ్మాయి "మ్యాజిక్".. 150 మంది ఖతం!
- "నీ ఫోన్ నంబర్ లో 5 ఉందిగా.. నీకు జాబ్ లేదు పో!" (డేయ్.. ఎన్నడా ఇదీ..?)
- పెళ్లైన ఏడాది తర్వాత తెలిసింది.. "మొగుడు" ఒక అమ్మాయి అని!
- "ఛీ.. ఛీ.. ఏందిరా ఈ ఛండాలమూ..?" ఉద్యోగుల టాయిలెట్లో.. సీసీ కెమెరాలు!
- "ఎవరా నేరస్థుడు?" పోలీసుల వల్ల కాలేదు.. "దోమ" పట్టించింది!