ETV Bharat / city

మాట్లాదామని భర్తను పిలిచి.. కళ్లలో కారం కొట్టి.. ఆ తర్వాత? - భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

Wife Killed Husband: వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. అయినా వేర్వేరుగా ఉంటున్నారు. ఏమైందో తెలియదు.. తానుంటున్న ఇంటి ముందు నుంచి వెళ్తున్న భర్తను మాట్లాడదామని పిలిచింది. ఆగిన భర్త కంట్లో కారం కొట్టింది. పారిపోతుంటే రోకలిబండతో కొట్టింది. ఇంకేముంది.. తాను అనుకున్నట్టే భర్త చచ్చిపోయాడు. ఇదంతా ఎందుకు.. ఎక్కడ.. అంటే..?

Wife Killed Husband
మాట్లాదామని పిలిచి..కళ్లలో కారం కొట్టి..
author img

By

Published : Mar 27, 2022, 2:52 PM IST

Wife Killed Husband:తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో దారుణం చోటుచేసుకుంది. భార్యే భర్తను చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాచర్ల రాజయ్య, రాజక్క దంపతులు. కల్లు అమ్ముకుంటూ జీవనంసాగించే వారి మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. కొన్ని రోజులుగా ఇద్దరూ వేర్వేరుగా నివాసముంటున్నారు. వీళ్లకు ముగ్గురు కుమార్తెలు కాగా.. ఒక కూతురు చనిపోయింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే.. అందులో ఒక కూతురు భర్తను వదిలేసి తల్లితోనే ఉంటోంది.

ఈ నేపథ్యంలో ఏం జరిగిందో ఏమో.. ఎలాగైనా భర్త రాజయ్యను హతమార్చాలని నిశ్చయించుకుంది రాజక్క. ఈరోజు(మార్చి 27) వేకువజామున తాను ఉంటున్న ఇంటి ముందు నుంచి వెళ్తున్న రాజయ్యను గమనించింది. మాట్లాడుదామని ఇంటికి పిలిచింది. ఆమె మాటలు నమ్మిన రాజయ్య ఆగటంతో.. ఒక్కసారిగా కంట్లో కారం కొట్టింది. తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలోనే రోకలిబండతో.. తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ రాజయ్య అక్కడే ఉన్న మురుగు కాలువలో పడిపోయి ప్రాణాలు విడిచాడు.

ఉదయం పూట మురుగుకాలువలో విగతజీవిగా పడి ఉన్న రాజయ్యను చూసి.. స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విచారించగా అసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. రాజయ్య హత్య వెనుక రాజక్క మాత్రమే ఉందా..? ఇంకా ఎవరైనా ఉన్నారా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం రాజయ్య మృతదేహాన్ని మహదేవ్​పూర్​ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Accident: ఘాట్‌ రోడ్డులో రక్షణ చర్యలేవి.. ప్రజల ఆగ్రహం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.