ETV Bharat / city

ఆ కేసులో పోలీసులు ఎందుకు వెనక్కు తగ్గారు?: వర్ల - varla ramaiah comments on om pratap case

ఎస్సీ యువకుడు ఓం ప్రతాప్‌ విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. పోలీసులు ఎందుకు వెనక్కు తగ్గారని వర్ల ప్రశ్నించారు. అతని ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Why did the police back down in that case: Varla
తెదేపా నేత వర్ల రామయ్య
author img

By

Published : Aug 28, 2020, 3:56 PM IST

ఎస్సీ యువకుడు ఓం ప్రతాప్‌ విషయంలో ప్రభుత్వం ఘోర తప్పిదం చేసిందని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. దర్యాప్తు చేయకుండా రహస్యంగా శవాన్ని ఖననం చేయడం పెద్ద తప్పు అని స్పష్టం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఎందుకు వెనక్కు తగ్గారు..? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు ఎందుకు చేయలేదని నిలదీశారు. ప్రతాప్ ఫోన్ తీసుకున్న పోలీసు అధికారిపై విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. మృతుని కుటుంబసభ్యుల సంతకాలు తెల్ల కాగితంపై తీసుకున్నదెవరని నిలదీశారు. ఓం ప్రతాప్‌ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

మంత్రి స్వగ్రామంలో మద్యం, పేకాట శిబిరాలు...అడ్డుకున్న పోలీసులపై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.