ETV Bharat / city

spl train కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే - కాచిగూడ తిరుపతి రైలు

Weekend trains from Yeswantpur to Kachiguda యశ్వంత్​పూర్​- కాచిగూడ మధ్య వారాంతపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Weekend trains
ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
author img

By

Published : Aug 25, 2022, 9:46 AM IST

Weekend trains from Yeswantpur to Kachiguda: యశ్వంత్‌పుర్‌- కాచిగూడ-యశ్వంత్‌పుర్‌ మధ్య వారాంతపు రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు సెప్టెంబరు 2న శుక్రవారం మ.2.20 గంటలకు బెంగళూర్‌ యశ్వంత్‌పుర్‌లో బయలుదేరి మరునాడు తెల్లవారుజామున 3.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందన్నారు. తిరిగి కాచిగూడలో శనివారం సాయంత్రం 3.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు యశ్వంత్‌పుర్‌కు చేరుకుంటుందన్నారు.

కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు.. కాచిగూడ నుంచి పలు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. కాచిగూడ-తిరుపతి రైలు ఈ నెల 26న రాత్రి 10.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరునాడు ఉదయం 10 గంటలకు తిరుపతి చేరుకుంటుందన్నారు. తిరుపతి-కాచిగూడ రైలు 27న సాయంత్రం 3.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరునాడు తెల్లవారుజామున 3.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందన్నారు.

కాచిగూడ-నాగర్‌సోల్‌ రైలు 28న కాచిగూడలో రాత్రి 8.20 గంటలకు బయలుదేరి మరునాడు ఉ 8.35కు నాగర్‌సోల్‌ (శిరిడీ)కి చేరుకుంటుందన్నారు. నాగర్‌సోల్‌-కాచిగూడ రైలు 29న నాగర్‌సోల్‌లో రాత్రి 10 గంటలకు బయలుదేరి మరునాడు ఉ 9.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.