నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడు సహా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించినట్లు.. అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి.. మరట్వాడ, తెలంగాణ, రాయలసీమల మీదుగా ఉత్తర తమిళనాడు వరకు 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు తెలిపింది.
రాగల మూడు రోజులు వర్ష సూచన :
ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రాలో.. నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సోమ, మంగళవారాల్లో.. రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. రాయలసీమలో కొన్నిచోట్ల.. ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: బుగ్గవంక నిర్వాసితుల వెతలు... ఇళ్లు కోల్పోతున్న బాధితులు