వచ్చే 4 రోజులపాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల శాఖ ప్రకటించింది. దీనివల్ల పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు.. ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ప్రజలు దీనికి తగినట్లుగా తగు జాగ్రత్తలు తీసుకుని మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని తెలిపింది.
ఇవీ చదవండి: