ETV Bharat / city

వైకాపా సర్కార్​ విధానాలపై కేంద్రం జోక్యం కోరుతాం: తెదేపా ఎంపీలు - తెదేపా ఎంపీలు వార్తలు

రాష్ట్రంలోని సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెదేపా ఎంపీలు తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తున్న విధానాలను పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వారు పాల్గొన్నారు.

TDP
TDP
author img

By

Published : Jan 28, 2021, 6:44 PM IST

Updated : Jan 28, 2021, 7:24 PM IST

మీడియాతో తెదేపా ఎంపీలు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వారి జోక్యం కోరాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఆర్థిక క్రమశిక్షణతో పాటు రాజ్యాంగ వ్యవస్థలపై దాడి, శాంతిభద్రతల సమస్య, దేవాలయాలపై దాడులు, వైకాపా కుంభకోణాలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని అధినేత చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా అంశం విషయమై వైకాపా ఎంపీలను నిలదీసి వారిపై ఒత్తిడి తీసుకురానున్నట్లు నేతలు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ పరంగా లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో చంద్రబాబు అధ్యక్షతన ఆయన నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్​లు ఈ భేటీలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు

ఎన్నికలకు ముందు 25మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ చెప్పారు. ప్రస్తుతం 22 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదాపై ప్రస్తావన లేదు. వైకాపా ఎంపీలు దీనిపై పార్లమెంట్​లో మాట్లాడేలా ఒత్తిడి తీసుకొస్తాం. విభజన చట్టంలో పెండింగ్​లో ఉన్న 19అంశాలు పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తాం. రాజధాని తరలింపు కుట్రను దిల్లీ వేదికగా ఆవిష్కరించటంతో పాటు ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తున్న విధానాలను పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. నరేగా నిధుల దుర్వినియోగం, పోలీసు వ్యవస్థ తీరును పార్లమెంట్​లో లేవనెత్తుతాం- గల్లా జయదేవ్, తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనలన్నీ రహస్య అజెండాతో సాగుతున్నాయి. అందుకే పర్యటన విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై వైకాపా నేతలు చేసిన అసత్య ఆరోపణలే ఇప్పుడు అడ్డం తిరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎత్తు తగ్గించమని చెప్తూనే నిల్వ సామర్థ్యంపై స్పష్టత ఇవ్వట్లేదు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన సాగుతున్నందున కేంద్రం జోక్యం కోరతాం. ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన భూ దోపిడీ, రాజ్యాంగ వ్యవస్థలపై దాడి, చట్టాలను చుట్టాలుగా చేసుకుని బెదిస్తున్న తీరును డీవోపీటీ దృష్టికి తీసుకెళ్లటంతో పాటు పార్లమెంట్​లోనూ ప్రస్తావిస్తాం- కనకమేడల రవీంద్ర కుమార్, రాజ్యసభ సభ్యుడు

వైకాపా ఎంపీలు జగన్​ను సీబీఐ, ఈడీ కేసుల నుంచి ఎలా కాపాడాలనే దానిపైనే కాలం గడుపుతున్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికలు ముందు జగన్ చెప్పిన మాటలను ఆయనకు గుర్తు చేస్తున్నాం. కేంద్రం మెడలు ఎక్కడ వంచారు. ఎప్పటిలోగా ప్రత్యేక హోదా సాధిస్తారో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి. రాజ్యాంగం కంటే తానే గొప్పవాడిననే అహంకారం జగన్​ది. ఆ ధోరణితోనే వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారు- రామ్మోహన్ నాయుడు, ఎంపీ

ఇదీ చదవండి

రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన

Last Updated : Jan 28, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.