రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తాము వ్యతిరేకం కాదని తెదేపా ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై పోరాడలేకే తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కరవు జిల్లాల పరిస్థితి ఏంటో ప్రభుత్వమే చెప్పాలని.. ప్రకాశం జిల్లా రైతుల కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే లేఖ రాసినట్లు చెప్పారు. రైతుల గుండెకోతను లేఖ ద్వారా వివరించామని చెప్పారు.
భాజపా నేత విష్ణువర్ధన్‌రెడ్డి తమను విమర్శించడం సరికాదని.. విభజన హామీల అమలు బాధ్యత కేంద్రానికి ఉందో.. లేదో ఆయన చెప్పాలని బాలవీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. హమీలపై మాట్లాడే భాజపా నేతలను పార్టీ నుంచి పంపిస్తారా? అని ప్రశ్నించారు. అనిల్ కావాలనే వేరే జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వెళ్లారు.
ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతలపై తెదేపా ఎమ్మెల్యేల అభ్యంతరం... సీఎం జగన్‌కు లేఖ!