ETV Bharat / city

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్​ రంగం: మంత్రి బాలినేని - power sector

గత ప్రభుత్వం చేసిన తప్పులు తమకు గుదిబండలుగా మారాయని మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. వాటిని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్ రంగంలో భారీగా ఉన్న బకాయిలను చెల్లిస్తున్నామని వెల్లడించారు.

బాలినేని
author img

By

Published : Sep 29, 2019, 11:13 PM IST

తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, తప్పుడు విధానాల కారణంగా ఎన్నడూ లేని రీతిలో విద్యుత్‌ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మార్చి 2019 నాటికి కరెంటు సరఫరా చేస్తున్న సంస్థలకు గత ప్రభుత్వం రూ.20 వేల కోట్లు బకాయిలు పెట్టారని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా వైయస్‌. జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యుత్‌రంగంపై సమీక్ష చేసి, ఆ రంగాన్ని కాపాడడానికి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని.. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నారని చెప్పారు. కరెంటు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నారని వెల్లడించారు. కేవలం ఎన్టీపీసీకే రూ. 3414 కోట్లు చెల్లించామని, మరో రూ.1200 కోట్ల రూపాయలను ఇతర విద్యుత్‌ సంస్థలకు చెల్లించామని మంత్రి తెలిపారు. ఇందులో రూ.700 కోట్లు ప్రైవేటు థర్మల్‌ కేంద్రాలకు, మరో రూ. 460 కోట్లు ట్రాన్స్‌మిషన్‌ బకాయిలను చెల్లించామని వివరించారు. రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన బొగ్గు సరఫరాలో అంతరాలు, కొరత కారణంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు పడుతున్న ఇబ్బందులను నివారించడానికి సత్వర చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాయటంతో పాటు, సింగరేణి నుంచి ఉత్పత్తి పెంచాల్సిందిగా కోరారని గుర్తు చేశారు.

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాంలో అంతర్జాతీయ చిత్రకళ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయనగరం పార్లమెంటరీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో వారు మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ కళాకారులతో ఇలాంటి అత్యుత్తమ వేదిక ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఎంతోమంది కళాకారులకు తమ కళా నైపుణ్య ప్రతిభను ప్రదర్శించే అవకాశముందన్నారు . చిత్ర కళాకారులకు ఎంతో ప్రేరణ ఇస్తుందని ప్రశంసించారు. వారం రోజుల పాటు జరుగు ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంక్లేవ్ కార్యక్రమం లో పాల్గొనేందుకు రష్యా, ఇటలి, ఇరాన్ దేశాలతో పాటు భారతదేశంలో ఢిల్లీ, అహ్మదాబాద్ , కలకత్తా , హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుండి 20 మంది అంతర్జాతీయ చిత్ర కళాకారులు హాజరయ్యారు . ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో విదేశీ కళా చిత్రకారులు పాల్గొని మాట్లాడారు.

Body:శ్రీకాకుళం జిల్లా రాజాంలో అంతర్జాతీయ చిత్రకళ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయనగరం పార్లమెంటు సభ్యులు చంద్రశేఖర్ ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రారంభించారు

Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాంలో అంతర్జాతీయ చిత్రకళ సమ్మేళన కార్యక్రమం ప్రారంభించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.