ETV Bharat / city

SRISAILAM: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల - శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల చేశారు. జలాశయానికి వరద ఉద్దృతి కొనసాగుతున్నందును అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది.

Water releaseజలాశయం వద్ద పర్యటకులు
Water releaseజలాశయం వద్ద పర్యటకులు
author img

By

Published : Jul 29, 2021, 8:50 AM IST

Updated : Jul 29, 2021, 11:52 AM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,62,390 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 3,45,054 క్యూసెక్కులుగా నమోదవుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం.. 884.40 అడుగులమేర నీళ్లు చేరాయి. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు.. 210 టీఎంసీల వరకు జలాశయంలో నీళ్లు చేరాయి. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగనుంది.

జలాశయం వద్ద పర్యటకులు

ఇలాంటి ప్రకృతి అందాన్ని చాలా అరుదుగా చూస్తుంటాం. 2, 3 గేట్లు చూస్తేనే ఆనందిస్తాం. అలాంటిది ఇవాళ 10 గేట్లు ఎత్తి నీటిని వదలడం చూసి.. మరింత ఆనందం కలుగుతోంది. ఇక్కడి నుంచి వెళ్లాలని మాకు అనిపించడం లేదు. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. - జలాశయం వద్ద పర్యటకులు

ఇదీ చదవండి:

సింధు దూకుడు.. ఒలింపిక్స్​ క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశం

డిఫెండింగ్​ ఛాంపియన్​పై విజయం- హాకీలో క్వార్టర్స్​కు!

Last Updated : Jul 29, 2021, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.