జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తాజా ఆదేశాలతో పట్టణ ప్రజారోగ్య విభాగంలో సంస్కరణలకు పురపాలశాఖ శ్రీకారం చుడుతోంది. స్వచ్ఛ పట్టణాల కోసం పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో అన్ని దశల్లోనూ జవాబుదారీతనం ఉండేలా పలు చర్యలు తీసుకుంటోంది. ఇళ్ళ నుంచి రోజూ చెత్త సేకరణతోపాటు యాజమాన్య కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన పురపాలకశాఖ వీటి అమలు కోసం కమిషనర్లకు ఆదేశాలిచ్చింది.
- అన్ని పట్టణాల్లోనూ ఆగస్టు నాటికి ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్త సేకరించాలి. చెత్తను తడి, పొడిగా విభజించే ప్రక్రియను సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలి.
- డంపింగ్ యార్డులకు చెత్తను స్వచ్ఛంద సంస్థ సరఫరా చేసిన వాహనాల్లో మాత్రమే తరలించాలి.
- యార్డు ప్రాంగణాల్లో చెత్త నుంచి ఎరువుల తయారీ కేంద్రాల ఏర్పాటు.. విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిమెంట్ తయారీ ప్లాంట్ల అవసరాలకూ వ్యర్థాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి.
- డంపింగ్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- పారిశుద్ధ్య కార్మికుల హాజరు కోసం ముఖ గుర్తింపు విధానం అమలు చేయాలి.
- 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ సంచుల విక్రయాలు, వినియోగాన్ని నిషేధించాలి.
- మురుగునీటిని నేరుగా చెరువుల్లో, కాలువల్లో, సముద్రంలో విడిచిపెట్టకుండా శుద్ధి చేసేలా చర్యలు చేపట్టాలి.
- ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు పురపాలక సంస్థల్లో కాల్సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల నమోదు, వాటి పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలి.
ఇదీ చదవండి :