ETV Bharat / city

'కొవిడ్‌ లక్షణాలుంటే వెంటనే టెస్టులు, స్కాన్‌లంటూ వెళ్లొద్దు' - ghmc covid control room

కొవిడ్​ నియంత్రణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని...తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

GHMC
GHMC
author img

By

Published : May 4, 2021, 11:26 AM IST

కొవిడ్​ నియంత్రణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని తెలంగాణ వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నవారికి ఎలాంటి కొవిడ్​ లక్షణాలున్నా... వైద్య సలహాలు, సూచనలకు, కావాల్సిన వైద్య కిట్​ల కోసం 040-2111-1111 నెంబర్​కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 104 కు వచ్చే కాల్స్​ను కూడా కొవిడ్​ కంట్రోల్ రూమ్ నెంబర్​కు అనుసంధానం చేస్తున్నట్లు రిజ్వి తెలిపారు.

కొవిడ్​ లక్షణాలుంటే వెంటనే టెస్టులనీ, స్కానింగ్​లనీ వెళ్లొద్దని... ముందస్తుగా 5 రోజులపాటు మందులు వాడాలని వైద్య శాఖ ఓఎస్డీ గంగాధర్ సూచించారు. అవసరమైన వారికి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల ద్వారా మెడికల్ కిట్​లను అందిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్​లో కొవిడ్​ సంబంధిత వైద్య సహాయాన్ని, కొవిడ్​ పాజిటివ్ వస్తే చేపట్టాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు తదితర సలహాలు సూచనల కోసం జీహెచ్ఎంసీ కొవిడ్​ కంట్రోల్ రూమ్ నుంచి వైద్యులను ప్రత్యేకంగా నియమించారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు విడతల్లో వైద్యులు కంట్రల్ రూమ్ నుంచి ఫోన్​లో అందుబాటులో ఉంటారని తెలిపారు.

కంట్రోల్ రూమ్​లో విధులు నిర్వర్తించే వైద్యులకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఓరియెంటేషన్ కార్యక్రమం వైద్యశాఖ కార్యదర్శి రిజ్వి నిర్వహించారు. కార్యక్రమానికి సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వైద్య శాఖ ఓఎస్డీ గంగాధర్​లు హాజరయ్యారు. అనంతర జీహెచ్ఎంసీ కొవిడ్​ కంట్రోల్ రూమ్​ను వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి సందర్శించారు. కంట్రోల్ రూమ్ పని తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:

ఇవాళ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.