ఎవరెక్కడ నుంచి..
302 కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెదేపా అభ్యర్థి హుజూర్నగర్ ఎస్పీ క్యాంపస్ స్కూల్లో ఓటేశారు.
ఈవీఎం మొరాయింపులు
మఠంపల్లి మండలం కేంద్రంలోని 79వ పోలింగ్ బూత్‌లో రెండు ఈవీఎంలు పదినిమిషాల పాటు మొరాయించాయి. పాలకీడు మండలం బెట్టెతండాలో వీవీప్యాట్, బ్యాలెట్ అనుసంధానంలో సమస్య తలెత్తెంది. నేరేడుచర్ల మండలం చింతబండలో ఈవీఎం కాసేపు ఇబ్బంది పెట్టింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సరైన వెలుతురు లేక ఓటర్లు అవస్థలు పడ్డారు. చిన్న చిన్న ఘటనలు మినహా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ఠ భద్రత కల్పించింది.
పెరిగిన ఓటింగ్
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ముగిసే సమయానికి 84.15 శాతం ఓట్లు పోలయ్యాయి. 2018 సాధారణ ఎన్నికల్లో 78.38 శాతం.. 2014లో 81.18 శాతం కంటే ఈసారి ఓట్ల సంఖ్య పెరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించనుండడం వల్ల పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. హుజూర్నగర్ మండలం అంబేడ్కర్ నగర్‌లోని పాఠశాలలో సాయంత్రం ఆరున్నర వరకు ఓటేసేందుకు ఓటర్లు వేచి చూశారు.