ETV Bharat / city

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం.. వేలు పలుకుతున్న ఓట్లు! - mle elections

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. నగదు, మద్యం సీసాలు, స్వీటు బాక్సులు, క్రికెట్‌ కిట్లు చివరకు కొందరికి మేకపోతులు కూడా పంపిణీ చేస్తూ ఓటర్లపై వల విసురుతున్నారు. కొన్నిచోట్ల పార్టీల నాయకులు సంఘాల నేతలతో మాట్లాడి గంపగుత్తగా ఓటర్ల మద్దతు కూడగట్టే, ఓటర్లను విడివిడిగా బుట్టలో వేసుకునే పనిని క్షేత్రస్థాయి కేడర్‌కు అప్పగించారు.

mlc elections
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం
author img

By

Published : Mar 13, 2021, 10:07 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు.. తెలంగాణ రాష్ట్రంలోని పార్టీలు, అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.శుక్రవారమే కొన్ని ప్రాంతాల్లో నగదు పంపిణీ మొదలైంది. పేరుకు ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా కొందరు అభ్యర్థులు సాధారణ ఎన్నికల స్థాయిలో ఖర్చుచేస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడట్లేదు. ఓ పార్టీ అభ్యర్థి ఏకంగా రూ. 35 కోట్లు ఖర్చుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమావేశాలకు భారీగా వెచ్చించిన నేతలు ఓటర్లకు పంపిణీ చేసే క్రమంలో మరింత ఖర్చుకు సిద్ధపడుతున్నారు.

ఓటుకు 1-3 వేలు.. ఆపైన

ఆదివారం పోలింగ్‌ ఉండటంతో ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించడంతో పాటు తమకు ఓటేసేలా చూడటంపై అభ్యర్థులు, పార్టీలు దృష్టి సారించాయి. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానంలో 5.05 లక్షల ఓటర్లుంటే..71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 5.31 లక్షల మంది ఓటర్లుంటే.. ఏకంగా 93 మంది పోటీపడుతున్నారు. కొందరు స్వతంత్రులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ప్రతి ఓటు కీలకంగా మారింది. దీంతో ఒక్కో ఓటు కనీసం రూ. వెయ్యి నుంచి రూ. మూడు వేలు పలుకుతోంది. పార్టీలు, అభ్యర్థుల ఆర్థికబలాన్ని బట్టి కొందరు డబ్బులు ఇస్తుంటే.. మరికొందరు రవాణా, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు మందుపార్టీలు కూడా ఏర్పాటు చేశారు.

ఓటర్ల జల్లెడ.. అంతా గంటలోనే

ఇప్పటికే కుల సంఘాలు, ఇతర సంఘాలతో పార్టీలు విందు సమావేశాలు నిర్వహించాయి. ఇప్పుడు నేరుగా పట్టభద్ర ఓటర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బూత్‌లవారీగా కార్యకర్తల్ని ఇంఛార్జీలను నియమించారు. ఓటర్లలో అనుకూలురు, తటస్థులు.. స్థానికులు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు.. ఇలాంటి వివరాలన్నింటినీ పార్టీలు సేకరించి పెట్టుకున్నాయి. ఈ సమాచారం ఆధారంగా వ్యూహాలు అమలుచేస్తున్నాయి. బూత్‌ ఇన్‌ఛార్జీల ద్వారా నగదు పంపిణీకి ఏర్పాట్లుచేశాయి. నేతలు ఓటర్ల ఫోన్‌ నంబర్ల ఇప్పటికే సేకరించారు. శనివారం ఆన్‌లైన్‌లో చెల్లింపులకు సిద్ధం అవుతున్నారు. ‘‘ఇప్పటికే స్లిప్‌లు పంచాం. ఓటుకు 3-5 వేలు రావచ్చన్న సంకేతాలు అందాయి. శనివారం గంటలో పని అయిపోతుంది. ఇంటింటికి వెళ్లాల్సిన పనిలేదు’ అని ఓ పార్టీ పోలింగ్‌ బూత్‌ ఇన్‌ఛార్జి ‘ఈనాడు’తో చెప్పారు.

గొర్రెలు, మేకలు కూడా..

వరంగల్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచే డబ్బు పంపిణీ మొదలైంది. ఓ పార్టీ నేతలు ఓటుకు రూ. 2 వేల చొప్పున ఇస్తున్నారు. కుల, యువజన సంఘాలకు గొర్రెపోతులు, మేకపోతుల్ని ఇచ్చారు. మరోపార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శనివారం నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. నర్సంపేటలో 25 మంది సభ్యులున్న ఓ సంఘం పార్టీని ఏకంగా 2 లక్షలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శుక్రవారమే డబ్బుల పంపిణీ మొదలైంది. ఓ పార్టీ ఓటుకు రూ.వెయ్యి చొప్పున ఇస్తోంది. బూత్‌ల వారీగా నియమించిన ఇన్‌ఛార్జీలు డబ్బు పంచుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఒక అభ్యర్థి మందు బాటిళ్లు ఇచ్చారు. నల్గొండ జిల్లాలో ఓ పార్టీ నేతలు ఓటర్ల జాబితాను సంపాదించి శనివారం తన వ్యూహం అమలుకు ఏర్పాట్లు చేసుకుంది. మండలాలవారీగా నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఓ పార్టీ కొన్నిచోట్ల యువజన సంఘాలకు క్రికెట్‌ కిట్లు పంపిణీ చేసింది. ఇతర సంఘాల నేతలతో మాట్లాడారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో కొన్ని సంఘాల నేతలకు ఓ పార్టీ శుక్రవారం మందు పార్టీ ఏర్పాటుచేసింది.

ఇదీ చదవండి:

రేపే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.