బ్యాంకులను మోసం చేశారన్న అభియోగాలపై టెలికాం పరికరాల తయారీ సంస్థ వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్టియం నుంచి సుమారు రూ.1,700 కోట్ల రుణాలు తీసుకొని ఇతర అవసరాలకు మళ్లించి మోసం చేశారని ఆరోపణలపై విచారణ చేస్తోంది.
పీఎన్బీ ఫిర్యాదు మేరకు 2018లో వీఎంసీ డైరెక్టర్లు హిమబిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, భగవంతుల వెంకటరమణపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. హిమబిందు, ఇతర డైరెక్టర్ల ముందస్తు బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు ఇటీవల కొట్టివేసింది. విచారణకు సహకరించడం లేదన్న కారణంగా హిమబిందును ఇవాళ ఈడీ అరెస్టు చేసింది.
ఇదీ చదవండి: