ETV Bharat / city

సీఎం సహాయ నిధికి దాతల చేయూత

author img

By

Published : May 16, 2020, 7:04 AM IST

Updated : May 16, 2020, 5:07 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విశాఖ పోర్ట్‌ ట్రస్టు రూ.75 లక్షలు, ఏపీ ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాల సంఘం రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చాయి.

visakha port trust has donated 75 lakh to the chief minister's aid fund

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విశాఖ పోర్ట్‌ ట్రస్టు రూ.75 లక్షలు, ఏపీ ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాల సంఘం రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చాయి. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విశాఖ పోర్ట్‌ ట్రస్టు ఛైర్మన్‌ కె.రామమోహన్‌రావు విరాళం చెక్కును అందజేశారు. పాఠశాలల యాజమాన్యాల తరఫున ఆ సంఘం అధ్యక్షుడు ఎంవీ రామచంద్రారెడ్డి, ప్రతినిధులు తులసి విష్ణు ప్రసాద్‌, ఎంవీ రావు, ఎంఎస్‌ఎన్‌ రెడ్డి, విజయ్‌ చెక్కును ముఖ్యమంత్రికి ఇచ్చారు. వీరితో పాటు హోంమంత్రి సుచరిత కూడా ఉన్నారు.

Last Updated : May 16, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.