ETV Bharat / city

Vijayawada CP on FD fraud case: 'రూ.2 కోట్లు రికవరీ చేశాం.. ఇంకా రూ.8 కోట్లు రావాలి' - Fixed Deposit funds fraud in ap

నకిలీ ఎఫ్​డీల కేసులో సీసీఎస్ పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారని విజయవాడ సీపీ శ్రీనివాసులు(Vijayawada CP on Fixed Deposit funds fraud case) వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆత్కూరు, భవానీపురం పీఎస్‌లలో కేసులు(police cases registerd on FD fraud case) నమోదైనట్లు తెలిపారు. దాదాపు రూ.2 కోట్లు సొమ్ము రికవరీ చేశామని స్పష్టం చేశారు.

vijayawada police commissioner Sreenivasulu
Vijayawada CP on FD fraud case
author img

By

Published : Nov 26, 2021, 4:26 PM IST

నకిలీ ఎఫ్​డీల కేసులో కొత్త వ్యక్తులు చాలా మంది బయటపడ్డారని విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు(Vijayawada CP on FD fraud case) తెలిపారు. ఎఫ్‌డీల కేసు హైదరాబాద్‌(Telugu Akademi FDR fraud case)లో ప్రారంభమై విజయవాడకు చేరిందని.. ఆత్కూరు, భవానీపురం పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. హైదరాబాద్‌ నుంచి 8 మందిని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చామని వివరించారు. దాదాపు రూ.2 కోట్ల సొమ్ము రికవరీ చేశామన్న ఆయన.. రూ.2.57 కోట్ల ఆస్తులను సీజ్ చేసి కోర్టుకు అందజేశామని పేర్కొన్నారు.

'రూ.11.4 కోట్లు కొత్త మోసం చేసేందుకు నకిలీ ఎఫ్‌డీలు తయారు చేశారు. రూ.11.4 కోట్ల ప్రభుత్వ సొమ్ము మోసం జరగకుండా ఆపాం. ఇంకా రూ.8 కోట్ల సొమ్ము రికవరీ కావాల్సి ఉంది. బ్యాంకు సిబ్బంది, మేనేజర్లు మోసాలకు పాల్పడుతున్నారు. రుణాల ముసుగులో డిపాజిట్ల దందా జరుగుతోంది. వచ్చిన సొమ్మును హవాలా కోసం నేరస్థులు వినియోగించారని సమాచారం' - బి.శ్రీనివాసులు విజయవాడ సీపీ

ఇదీ చదవండి:

Affidavit On Amaravathi: పాలనా వికేంద్రీకణ బిల్లును ఉపసంహరించుకున్నాం.. రాజధాని కేసుల్లో ప్రభుత్వం అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.