లాక్ డౌన్‌కు చాలా మంది ప్రజలు సహకరిస్తున్నారని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామన్న ఆయన... సహకరించని వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన వారిని చాలా వరకు గుర్తించామని చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా క్వారంటైన్లో ఉండాలని పిలుపునిచ్చారు. ద్విచక్రవాహనంపై ఒక్కరే వెళ్లాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ జోన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇలాంటి ప్రాంతాల్లో ఇంటింటికీ నిత్యావసర సరుకుల వంటివి సరఫరా జరుగుతున్నాయని పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలంతా అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: